Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: దేవుడి రికార్డ్ సమం.. దద్దరిల్లిన క్రికెట్ మక్కా! హాట్‌స్టార్ నయా చరిత్ర!

IND vs SA: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల మోతకు క్రికెట్ మక్కా అయిన ఈడెన్ గార్డెన్స్ దద్దరిల్లింది. ఆల్‌టైమ్ రికార్డ్ వ్యూయర్‌షిప్‌తో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌ పంట పండింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు.

వన్డే కెరీర్‌లో విరాట్ కోహ్లీకి ఇది 49వ సెంచరీ. దాంతో అతను అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన ఘనతను కోహ్లీ సమం చేశాడు. తన 35వ జన్మదినం సందర్భంగా దేవుడి రికార్డును సమం చేసి బర్త్‌డేను మరింత ప్రత్యేకంగా మలుచుకున్నాడు.

IND vs SA: 4.4 cr simultaneously watch Virat Kohli equal Sachin Tendulkar’s record in Hotstar

50 సెంచరీలతో..:అంతర్జాతీయ వన్డేల్లో 452 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు బాదగా.. విరాట్ కోహ్లీ 277 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశాడు. తద్వారా వైట్ బాల్ క్రికెట్‌లో 50 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 49 సెంచరీలు బాదిన కింగ్.. టీ20ల్లో ఒక సెంచరీ నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌కు ముందు మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు కోహ్లీ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్‌తో 95 పరుగులు చేసి ఔటైన కోహ్లీ.. ఇంగ్లండ్‌తో డకౌటయ్యాడు. శ్రీలంకతో 88 పరుగుల వద్ద వెనుదిరిగాడు. చివరకు తన పుట్టిన రోజున అరుదైన ఘనతను ఎట్టకేలకు సాధించాడు.

118 డెసిబుల్స్ సౌండ్..:విరాట్ కోహ్లీ రికార్డు సెంచరీ నేపథ్యంలో ప్రేక్షకుల అరుపులతో క్రికెట్ మక్కా.. ఈడెన్ గార్డెన్స్ దద్దరిల్లింది. 118 డెసిబుల్స్ సౌండ్ వచ్చింది. ఈ ప్రపంచకప్‌లో ఇంత శబ్దంతో అభిమానులు అరవడం ఇదే తొలిసారి. కోహ్లీ 49వ శతకం బాదిన సమయంలో హాట్ స్టార్ రియల్ టైమ్ వ్యూయర్ షిప్ సైతం అమాంతం పెరిగింది. ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది.

హాట్‌స్టార్ ఆల్‌టైమ్ రికార్డు..:కోహ్లీ శతకం పూర్తి చేసనప్పుడు 4.4 కోట్ల మంది వీక్షించారు. డిజిటల్ హిస్టరీలోనే ఇది నయా రికార్డు. ఇదే టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 95 పరుగులతో ఉన్నప్పుడు 4.3 కోట్ల మంది చూశారు. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా తాజాగా బద్దలయ్యింది. ఫైనల్ వరకు తాజా రికార్డు కూడా బ్రేక్ అవ్వనుంది.

IND vs SA: 4.4 cr simultaneously watch Virat Kohli equal Sachin Tendulkar’s record in Hotstar

కోహ్లీకి సెల్యూల్..:విరాట్ కోహ్లీకి ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్‌తో పాటు సెల్యూల్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల‌కు 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్) రికార్డు సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు.

సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, టబ్రైజ్ షంసీ, ఎయిడెన్ మార్క్‌రమ్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, November 5, 2023, 19:08 [IST]
Other articles published on Nov 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+