Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: సెంచరీతో తిలక్ వర్మ విధ్వంసం!

నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ(56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 107 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. తిలక్‌ వర్మతో పాటు అభిషేక్ శర్మ(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఆండిలే సిమలనె, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.

IND vs SA 3rd T20I Tilak Varma maiden ton helps India to 219 6

సంజూ మళ్లీ డకౌట్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్(0) మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పరుగుల ఖాతా తెరవకుండానే టీమిండియా వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు.

తిలక్ వస్తూనే వరుసగా ఓ బౌండరీతో పాటు సిక్స్ బాదాడు. అభిషేక్ శర్మ కూడా బౌండరీలు బాదడంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ.. వేగాంగా పరుగులు రాబట్టింది. మహారాజ్ వేసిన 9వ ఓవర్‌లో తొలి బంతిని సిక్సర్‌గా బాదిన అభిషేక్ శర్మ.. మరుసటి బంతికి సింగిల్ తీసి 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సూర్య విఫలం..
ఆ వెంటనే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అభిషేక్ స్టంపౌటయ్యాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(1) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. సిమలానె బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా వరుస బౌండరీలతో జోరు కనబర్చాడు.

మరోవైపు తిలక్ వర్మ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా(18) స్వీప్ షాట్ ఆడబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది.

తిలక్ శతకం..
దాంతో బ్యాటింగ్‌కు దిగిన రింకూ సింగ్‌తో కలిసి తిలక్ ధాటిగా ఆడాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు రింకూ సింగ్ ఇబ్బంది పడినా.. తిలక్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. సిమలానే వేసిన యార్కర్‌కు రింకూ సింగ్(8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 58 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి వచ్చిన అరంగేట్ర ప్లేయర్ రమణ్‌దీప్ సింగ్.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా తరలించాడు. సిపామ్లా బౌలింగ్‌లో బౌండరీ బాది తిలక్ వర్మ 51 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో తిలక్ వర్మకు ఇదే తొలి శతకం. చివర్లో రమణ్ దీప్ సింగ్ రనౌటవ్వగా.. అక్షర్‌తో కలిసి తిలక్ భారత ఇన్నింగ్స్‌ను ముగించాడు.

Story first published: Wednesday, November 13, 2024, 22:33 [IST]
Other articles published on Nov 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+