Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. సౌతాఫ్రికాతో ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో ట్రిస్టన్ స్టబ్స్‌ను ఔట్ చేయడం ద్వారా హార్దిక్ పాండ్యా ఈ ఫీట్ సాధించాడు. ఈ ఘనతను అందుకున్న మూడో భారత పేసర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్(112), జస్‌ప్రీత్ బుమ్రా(101) హార్దిక్ పాండ్యా(100*) కంటే ముందు ఈ ఫీట్ సాధించారు.

అంతర్జాతీయ టీ20ల్లో 1000 ప్లస్ రన్స్‌తో పాటు 100 వికెట్లు పడగొట్టిన తొలి పేస్ ఆల్‌రౌండర్‌గా కూడా హార్దిక్ పాండ్యా చరిత్రకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా కంటే ముందు స్పిన్ ఆల్‌రౌండర్లు అయిన షకీబ్ అల్ హసన్, మహమ్మద్ నబీ, సికిందర్ రాజా ఈ ఫీట్ సాధించారు. ఇప్పటి వరకు 123 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా.. 26.81 సగటు, 8.24 ఎకానమీతో 100 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 28.10 సగటు, 141.53 స్ట్రైక్‌రేట్‌తో 1939 పరుగులు చేశాడు.

IND vs SA 3rd T20I Hardik Pandya Becomes First Seamer With 1 000 Runs and 100 Wickets in T20Is

టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..

అర్ష్‌దీప్ సింగ్ (71 మ్యాచ్‌ల్లో 108 వికెట్లు)

జస్ప్రీత్ బుమ్రా(82 మ్యాచ్‌ల్లో 101 వికెట్లు)

హార్దిక్ పాండ్యా(123 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు)

యుజ్వేంద్ర చాహల్(80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు)

భువనేశ్వర్ కుమార్(87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు)

భారత్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 117 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో డోనవన్ ఫెర్రెయిరా(15 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 20), అన్రిచ్ నోర్జ్(12) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/25), హర్షిత్ రాణా(2/34), వరుణ్ చక్రవర్తీ(2/11), కుల్దీప్ యాదవ్(2/12) రెండేసి వికెట్లతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 120 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35) తన జోరు కొనసాగించగా.. శుభ్‌మన్ గిల్(28 బంతుల్లో 5 ఫోర్లతో 28), సూర్యకుమార్ యాదవ్(11 బంతుల్లో 2 ఫోర్లతో 12) మరోసారి తడబడ్డారు. తిలక్ వర్మ(34 బంతుల్లో 3 ఫోర్లతో 26 నాటౌట్), శివమ్ దూబే(4 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 10 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.

సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం లక్నో వేదికగా జరగనుంది.

Story first published: Sunday, December 14, 2025, 20:06 [IST]
Other articles published on Dec 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+