Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA 3rd T20I పిచ్ రిపోర్ట్ .. బౌలర్లకు పండుగే!

నాలుగు టీ20ల సిరీస్ కోసం సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత్ ఒక మ్యాచ్ గెలిచి మరోకటి ఓడింది. ఇప్పుడు మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. జోహన్నస్‌బర్గ్‌లోని సెంచూరియన్ మైదానం వేదికగా బుధవారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమయ్యే మూడో టీ20లో ఆతిథ్య సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.

ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న టీమిండియా.. తమ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ ఐదు వికెట్లతో విజయవకాశాలను సృష్టించినా.. భారత పేసర్లు పేలవ బౌలింగ్‌తో ఓటమికి కారణమయ్యారు. చెత్త బ్యాటింగ్ కూడా టీమిండియా ఓటమిని శాసించింది.

IND vs SA 3rd T20I Centurion Pitch And Weather Report fast bowlers being a real threat

తొలి టీ20లో శతకంతో చెలరేగిన సంజూ శాంసన్ రెండో మ్యాచ్‌లో డకౌటయ్యాడు. సూర్య, అభిషేక్, రింకూ సింగ్ తీవ్రంగా నిరాశపర్చగా.. అక్షర్ పటేల్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. కాస్తో కూస్తో మెరుగ్గా ఆడిన హార్దిక్ పాండ్యా అతి విశ్వాసంతో చివర్లో బంతులను వృథా చేశాడు. ఈ తప్పిదాలపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన టీమిండియా.. మూడో టీ20లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

మరోవైపు సమష్టి ప్రదర్శనతో విజయం సాధించిన సౌతాఫ్రికా అదే జోరును కొనసాగించాలనుకుంటోంది. ఈ క్రమంలోనే మూడో టీ20లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వర్ష సూచన లేదు..
తొలి రెండు మ్యాచ్‌లకు వర్ష సూచన ఉండగా.. మూడో టీ20కి ఎలాంటి సమస్య లేదు. వర్షం వచ్చే అవకాశాలు 20 శాతం మాత్రమే ఉన్నాయి. మ్యాచ్ టైమ్‌లో వాతావరణ పొడిగా ఉండనుంది. ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా ఉండనున్నాయి.

పిచ్ రిపోర్ట్..
సెంచూరియన్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండనుంది. ఈ వికెట్‌పై పేస్‌తో పాటు బౌన్స్ ఉండనుంది. పేస్ బౌలర్లు పండుగ చేసుకోనున్నారు. ఎక్స్‌ట్రా బౌన్స్ స్పిన్నర్లకు కూడా ఉపయోగపడనుంది. ఇక్కడ జరిగిన 14 మ్యాచ్‌ల్లో 8 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోనుంది.

పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఇరు జట్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇరు జట్లు ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగవచ్చు. భారత్ తరఫున యశ్ దయాల్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్.

సౌతాఫ్రికా: ఎయిడెన్ మార్క్‌రమ్, బార్ట్‌మన్, గెరాల్డ్ కోయిట్జీ, డోనోవన్ ఫెర్రెయిరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రీచ్ క్లాసెన్, పాట్రిక్ క్రుగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్‌లాలీ, పీటర్, ర్యాన్ రికెల్టన్, అండిలే సిమెలనే, లుతో సిపమ్లా, ట్రిస్టన్ స్టబ్స్.

Story first published: Tuesday, November 12, 2024, 17:59 [IST]
Other articles published on Nov 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+