
మూడు తప్పిదాలపై..
సీనియర్లు లేకపోయినా ఐపీఎల్ కారణంగా భారత ఆటగాళ్ల తాజా ఫామ్, సొంతగడ్డపై అనుకూలతలు చూస్తే దక్షిణాఫ్రికాపై మనదే పైచేయిగా కనిపించింది. కానీ తొలి మ్యాచ్‌లో 211 పరుగులు చేసి కూడా భారత్ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. దాంతో ఒక్కసారిగా టీ20 సిరీస్ ఆసక్తికరంగా మారిపోయింది. బౌలింగ్ వైఫల్యంతో గత మ్యాచ్‌లో ఓడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. మూడు తప్పిదాలను సరించుకోవాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

చాహల్‌ను పూర్తిగా వాడుకోవాలి..
ఐపీఎల్ 2022 సీజన్‌లో తన స్పిన్‌తో సత్తా చాటి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన యుజ్వేంద్ర చాహల్(0/26).. ఆ జోరును కొనసాగించలేకపోయాడు. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అతని సేవలను తాత్కలిక కెప్టెన్ రిషభ్ పంత్ పూర్తిగా వాడుకోలేకపోయాడు. పవర్ ప్లే ముగియక ముందే బంతినిచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో కట్టడిగా వేసినా.. చివరి ఓవరకు వరకు అతనికి మళ్లీ బంతిని అందించలేదు. దాంతో భారత్ విజయవకాశాలను దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే సరైన సమయంలో చాహల్‌కు బంతినిచ్చి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించాలని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.

అక్షర్‌కు బదులు రవి బిష్ణోయ్
స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(1/40) సైతం తొలి టీ20లో ప్రభావం చూపలేకపోయాడు. నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన అక్షర్.. కేవలం ఒక వికెట్ మాత్రమే తీసి ఓవర్‌కు 10 పరుగుల చొప్పున సమర్పించుకున్నాడు. మిడిల్ ఓవర్లలో సఫారీ బ్యాటర్ల జోరుకు కళ్లెం వేయలేకపోయాడు. మరోవైపు బ్యాటింగ్‌లో అక్షర్‌కు అవకాశం దక్కలేదు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న నేపథ్యంలో స్పిన్ ఆల్‌రౌండర్‌కు బదులు స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోవడమే ఉత్తమమని విశ్లేషకులు అంటున్నారు. వెస్టిండీస్‌తో సత్తా చాటిన రవి బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఉమ్రాన్ మాలిక్‌కు చోటివ్వాలి...
సన్‌రైజర్స్ హైదరాబాద్ సెన్సేషన్, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ పేస్‌కు మారు పేరుగా మారాడు. ఐపీఎల్‌లో 14 మ్యాచులాడి 22 వికెట్లు తీసిన ఈ స్పీడ్ స్టర్.. నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల వేగం కంటే బౌలింగ్ చేయడంలో దిట్ట. ఐపీఎల్‌లో రాణించిన ఉమ్రాన్‌ను జాతీయ జట్టుకు ఎంపిక చేసినా ఇటీవలే ఢిల్లీలో ముగిసిన తొలి టీ20లో మాత్రం అతనికి ఆడే అవకాశం దక్కలేదు. ఉమ్రాన్ నేర్చుకునే దశలో ఉన్నాడని, ఇంకొంచెం టైమ్ పడుతుందని చెప్పారు.
అయితే తొలి మ్యాచ్‌లో భారత పేసర్లు ధారళంగా విఫలమయ్యారు. వికెట్లు తీసినప్పటికీ పరుగులను నియంత్రించలేకపోయారు. ఈ క్రమంలోనే ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకుంటే తన పేస్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగలరని చెబుతున్నారు. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో అక్కడ పేస్, బౌన్సీ పిచ్‌లు ఉంటాయని, వాటికి ఉమ్రాన్ సరిగ్గా సరిపోతాడని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications
