సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో టీమిండియా తడబడింది. పేస్‌కు అనుకూలంగా ఉన్నపిచ్‌పై సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా(5/44), నండ్రే బర్గర్(2/50) నిప్పులు చెరగడంతో టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేఎల్ రాహుల్(105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 బ్యాటింగ్) విరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియాను ఆదుకున్నాడు.
దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 59 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. వర్షం కారణంగా చివరి సెషన్ ఆట సాధ్యం కాలేదు. వెలుతురు కూడా మందగించడంతో అంపైర్లు చివరి సెషన్ ఆటను రద్దు చేసి తొలి రోజును ముగించారు.

కేఎల్ రాహుల్‌కు తోడుగా విరాట్ కోహ్లీ(64 బంతుల్లో 5 ఫోర్లతో 38), శ్రేయస్ అయ్యర్(50 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), శార్దూల్ ఠాకూర్(33 బంతుల్లో 3 ఫోర్లతో 24) పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, బర్గర్‌కు తోడుగా మార్కో జాన్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పేస్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడంతో టీమిండియా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. షార్ట్ పిచ్ బాల్ వ్యూహంతో రోహిత్ శర్మ(5)ను రబడా బోల్తా కొట్టించగా.. యశస్వీ జైస్వాల్(17), శుభ్‌మన్ గిల్(2)లను బర్గర్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆరంభంలోనే ఈ ఇద్దరు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కోహ్లీ, అయ్యర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌లను సౌతాఫ్రికా ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కోహ్లీ, అయ్యర్ నిలకడగా బ్యాటింగ్ చేసి తొలి సెషన్‌ను ముగించారు. దాంతో టీమిండియా 91/3 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
రెండో సెషన్ ప్రారంభంలోనే రబడా అద్భుత బంతితో శ్రేయస్ అయ్యర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో నాలుగో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే రివర్స్ స్వింగ్‌తో కోహ్లీని.. లెంగ్త్ బాల్‌తో అశ్విన్(8)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు.
ఈ పరిస్థితుల్లో శార్తూల్ ఠాకూర్‌తో కలిసి కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు. ఏడో వికెట్‌కు 43 పరుగులు జోడించిన అనంతరం రబడా బౌలింగ్‌లో శార్దూల్ ఔటవ్వగా.. జస్‌ప్రీత్ బుమ్రా సాయంతో రాహుల్ 80 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు.
మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో బుమ్రా(1) క్లీన్ బౌల్డ్ అవ్వగా.. సిరాజ్ సాయంతో రాహుల్.. జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు. మూడో సెషన్ ప్రారంభమైన కాసేపటికే వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత వెలుతురు కూడా మందగించడంతో అంపైర్లు తొలి రోజు ఆటకు ముగింపు పలికారు.