న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA 1st ODI టర్నింగ్ పాయింట్.. పోటుగాడిలా స్ట్రైక్ తీసుకొని ఓటమికి కారణమైన ఆవేశ్ ఖాన్!

IND vs SA 1st ODI Turning Point: Avesh Khan Doesnt Give Strike To Sanju Samson In 39th Over

లక్నో: స్టార్లు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా.. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. సంజూ శాంసన్(63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 8 ఫోర్లతో 50) మెప్పించినా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. దాంతో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మరోవైపు డేవిడ్ మిల్లర్(63 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 నాటౌట్) హాఫ్ సెంచరీలకు తోడు బౌలర్లు కూడా రాణించడంతో సౌతాఫ్రికా సిరీస్‌లో బోణి కొట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ బ్యాటింగ్ సందర్భంగా చేసిన తప్పిదం టీమిండియా కొంపముంచింది.

శార్దూల్ ఔటవ్వడంతో..

శార్దూల్ ఠాకూర్, సంజూ శాంసన్ కలిసి ఆరో వికెట్‌కి 93 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం అందించడంతో భారత్ విజయం ఖాయమని... అయితే 15 బంతుల్లో 39 పరుగులు కావాల్సిన దశలో శార్దూల్ ఠాకూర్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన లోయరార్డర్ బ్యాటర్లు క్రీజులో సెట్ అయిన సంజూకి స్ట్రైయిక్ ఇవ్వలేదు. ఆలోచన లేని లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అనవసర షాట్లకి వెళ్లి, టీమిండియా ఓటమికి కారణమయ్యారు. వస్తూనే బంతిని గాల్లోకి లేపిన కుల్దీప్ యాదవ్ గోల్డెన్ డకౌట్ అవ్వగా.. ఆ తర్వాత వచ్చిన ఆవేశ్ ఖాన్ పోటుగాడిలా స్ట్రైక్ తీసుకొని బంతులను వృథా చేశాడు.

స్ట్రైకింగ్ ఇచ్చుంటే..

స్ట్రైకింగ్ ఇచ్చుంటే..

కీలక 39వ ఓవర్‌లో ఆవేశ్ ఖాన్ ఆవేశం కారణంగా భారత జట్టు ఓడిపోవాల్సి వచ్చింది. తొలి రెండు బంతుల్లో సింగిల్ తీయలేకపోయిన ఆవేశ్ ఖాన్, మూడో బంతికి 2 పరుగులు తీశాడు. ఇక్కడ సింగిల్ తీసి సంజూ శాంసన్‌కు స్ట్రైయిక్ ఇచ్చినా అతనికి మరో మూడు బంతులు ఫేస్ చేసే అవకాశం దక్కేది. అయితే ఆవేశ్ ఖాన్ అలా చేయలేదు. నాలుగో బంతికి కూడా పరుగులేమీ రాకపోగా ఐదో బంతికి మరో భారీ షాట్‌కి ప్రయత్నించి ఔట్ అయ్యాడు ఆవేశ్ ఖాన్. ఆ తర్వాత బంతికే రవి భిష్ణోయ్ కూడా ఇదే పని చేశాడు. వస్తూనే బంతిని గాల్లోకి లేపి క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నో బాల్ కావడంతో భిష్ణోయ్ బతికిపోయాడు. ఆ తర్వాతి బంతికి ఫోర్ వచ్చింది. మొత్తంగా ఈ ఓవర్‌లో 7 పరుగులు రాగా సంజూ శాంసన్ ఒక్క బంతిని కూడా ఆడలేదు.

రెండు బంతులు ఆడినా..

రెండు బంతులు ఆడినా..

ఆఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 30 పరుగులు కావాల్సి రాగా మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు రాబట్టాడు. మరో రెండు బంతులు ఆడి ఉంటే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసేవాడినని మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ స్వయంగా ధీమా వ్యక్తం చేశాడు. దీంతో ఆవేశ్ ఖాన్ ఆవేశపడకుండా 39వ ఓవర్‌లో ఓ రెండు బంతులనైనా సంజూ శాంసన్‌ని ఆడనిచ్చి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండేదని నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఆవేశ్ ఖాన్ ఆవేశం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయిందని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Friday, October 7, 2022, 13:01 [IST]
Other articles published on Oct 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X