ఫస్ట్ సెషన్ గంగపాలు..
వర్షం కారణంగా రెండో రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ఉదయం నుంచి వస్తూ పోతూ ఉన్న వర్షం.. ఆటకు అంతరాయం కలిగిస్తూనే ఉంది. ఇప్పటికే తొలి సెషన్ ఆట తుడిచిపెట్టుకుపోగా.. ఇంకా వర్షం పడుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. రెండో రోజు ఆటలో ఒక్క బంతి కూడా పడకుండానే మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా ఉంది. అయితే సోషల్ మీడియా వేదికగా టీమిండియా రెండో రోజుకు సంబంధించిన లంచ్ మెనూ వైరల్ అయింది. ఈ మెనూలో భారత ఆటగాళ్లకు చికెన్, పప్పు, టిక్కా తదితర ఐటెమ్స్ ఉన్నాయి.
పకోడిలు పెట్టండిరా..?
అయితే ఈ మెనూపై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదేమి హెల్తీ ఫుడ్ కాదని, అందుకే రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ గడ్డి తినలేక దూరంగా ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందేరేమో వర్షం పడుతుంటే పకోడిలు పెట్టారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వర్షం+పకోడి పర్ఫెక్ట్ కాంబినేషన్, అని కామెంట్ చేస్తున్నారు. భారత ఆటగాళ్లకు సరైన తిండి కూడా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సెంచరీతో చెలరేగిన రాహుల్..
ఓపెనర్ కేల్ రాహుల్ (248 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 122 బ్యాటింగ్) అజేయ సెంచరీ సాధించడంతో తొలి రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు సాధించింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (123 బంతుల్లో 9ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రాహుల్.. మయాంక్‌తో తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించాడు. ఆ తర్వాత కోహ్లీ (94 బంతుల్లో 4ఫోర్లతో 35), అజింక్యా రహానే ( 81 బంతుల్లో 8 ఫోర్లతో 40 బ్యాటింగ్)తో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. పుజారా డకౌటయ్యాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లనూ ఎంగిడి (3/45) పడగొట్టాడు. మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.

గాయంతో రోహిత్ దూరం..
ఇక వన్డే కెప్టెన్‌గా ప్రమోషన్ అందుకున్న రోహిత్ శర్మ.. తొడ కండరాల గాయంతో చివరి నిమిషంలో మూడు టెస్ట్‌ల సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకున్న హిట్ మ్యాన్.. గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లోనే హిట్ మ్యాన్.. సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కనున్నాడు. ఇక రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మయాంక్ హాఫ్ సెంచరీతో రాణించాడు.


Click it and Unblock the Notifications
