ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్‌కు ముందు టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ప్రధాని ఎలెవన్‌తో జరిగిన పింక్ బాల్ సన్నాహక మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌పై ఆసీస్ యువ పేసర్ రాకాసి బౌన్సర్లతో దాడి చేశాడు.
పెర్త్ టెస్ట్‌లో భారీ సెంచరీతో మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన యశస్వి జైస్వాల్‌ను గాయంతో భారత జట్టుకు దూరం చేయాలనే లక్ష్యంతో ఆసీస్ యువ పేసర్ జాక్ నిస్బేట్ బౌలింగ్ చేశాడు. పదే పదే రాకాసి బౌన్సర్లు విసిరి జైస్వాల్ సహనాన్ని పరీక్షించాడు. జైస్వాల్ ముఖాన్నే టార్గెట్ చేస్తూ బౌన్సర్లు సంధించాడు.

ఆసీస్ యువ పేసర్ జాక్ నిస్బేట్‌కు జైస్వాల్ తన బ్యాట్‌తోనే బదులిచ్చాడు. అతని బౌలింగ్‌ను చాకచక్యంగా ఎదుర్కొన్న యశస్వి జైస్వాల్.. బౌండరీలతోనే ధీటుగా బదులిచ్చాడు. జాక్ నిస్బేట్‌కు బౌన్సర్లకు యశస్వి జైస్వాల్ సహనం కోల్పోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సన్నాహక మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్(59 బంతుల్లో 9 ఫోర్లతో 45) చార్లీ అండర్సన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాన్‌బెరా వేదికగా జరిగిన రెండు రోజుల ఈ వామప్ మ్యాచ్‌లో తొలి రోజు అయిన శనివారం ఆట వర్షంతో తుడిచిపెట్టుకుపోవడంతో.. ఆదివారం 50 ఓవర్లకు కుదించి మ్యాచ్‌ను కొనసాగించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రధాని ఎలెవన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ సామ్ కోన్‌స్టాస్(97 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్‌తో 107) సెంచరీతో రాణించగా.. టేయిలెండర్ హన్నో జకోబ్స్(60 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
భారత బౌలర్లలో హర్షిత్ రాణాతో పాటు ఆకాశ్ దీప్(2/58) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి ఒక్క వికెట్ దక్కలేదు. ఈ సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయలేదు.
అనంతరం భారత్ 46 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(62 బంతుల్లో 7 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(32 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42), వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 5 ఫోర్లతో 42 నాటౌట్) దూకుడుగా ఆడారు. కేఎల్ రాహుల్(27), రవీంద్ర జడేజా(27) పర్వాలేదనిపించగా.. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ(3) తీవ్రంగా నిరాశపరిచాడు.
సర్ఫరాజ్ ఖాన్(1) కూడా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ సన్నాహక మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చేయలేదు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్ జరగనుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
Yashasvi Jaiswal Vs Jack Nisbet. 🌟 pic.twitter.com/JrzE4HHkTf
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 1, 2024