For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: ఆ షాట్ ఆడటానికి సిగ్గూ, శరం ఏమైనా ఉండాలి.. రిషభ్‌ పంత్‌ను ఏసుకున్న రోహిత్ శర్మ (వీడియో)!

IND vs PAK: Watch Rohit Sharma scolds Rishabh Pant in Indian dressing room for poor shot selection

దుబాయ్: ఆసియాకప్ 2022లో దాయాదీ పాకిస్థాన్‌పై రెండో విజయాన్ని టీమిండియా తృటిలో చేజార్చుకుంది. ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో అనవసర తప్పిదాలతో టీమిండియా పాక్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మిడిలార్డర్ వైఫల్యం, పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ముఖ్యంగా రిషభ్ పంత్ బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రిషభ్ పంత్.. రవీంద్ర జడేజా గాయంతో తప్పుకోవడంతో జట్టులోకి వచ్చాడు. లెఫ్టార్మ్ బ్యాటర్‌ కోటాలో తప్పనిసరి పరిస్థితుల్లో జట్టులోకి వచ్చిన పంత్ బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

మందలించిన హిట్ మ్యాన్..

ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను స్వేచ్చగా ఆడలేకపోయాడు. సింగిల్స్‌కే మొగ్గు చూపిన అతను చివరకు మహమ్మద్ నవాజ్ వేసిన 14వ ఓవర్‌లో చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. బాధ్యతాయుతంగా ఆడాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా ఆడి జట్టు పరాజయానికి కారణమయ్యాడు. అయితే పంత్ నిర్లక్ష్యంగా ఔటవ్వడంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన రిషభ్ పంత్‌ను రోహిత్ శర్మ మందలించడం టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. తాను ఆ షాట్ ఎందుకు ఆడాల్సి రావడానికి గల కారణాన్ని పంత్ వివరించే ప్రయత్నం చేసినా... రోహిత్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

సిగ్గూ, శరం..

సిగ్గూ, శరం..

'ఆ షాట్ ఆడటానికి సిగ్గూ, శరం ఏమైనా ఉండాలి.. నిన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు జట్టును నట్టేట ముంచావ్. నీకు బదులు దినేశ్ కార్తీక్‌ను ఆడించినా జట్టుకు మేలు జరిగేది'అని రోహిత్.. పంత్‌కు క్లాస్ పికాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ కూడా.. కీలక సమయంలో పంత్, హార్దిక్ పాండ్యా ఔటవ్వడం విజయవకాశాలను దెబ్బతీసిందని తెలిపాడు.

కోహ్లీ చెలరేగినా..

కోహ్లీ చెలరేగినా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. తర్వాత పాకిస్థాన్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ మహమ్మద్ రిజ్వాన్‌ (51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71) జట్టును ఒడ్డున పడేసే ఇన్నింగ్స్‌ ఆడాడు. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' మహమ్మద్‌ నవాజ్‌ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. భారత బౌలర్లలో ఏ ఒక్కరూ ప్రభావవంతమైన బౌలింగ్‌ చేయలేకపోయారు. నేడు విశ్రాంతి దినం కాగా.. రేపు సూపర్‌-4 రెండో లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్‌ ఆడుతుంది. ఫైనల్‌ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే శ్రీలంకపై భారత్‌ గెలవాల్సి ఉంటుంది.

Story first published: Monday, September 5, 2022, 14:32 [IST]
Other articles published on Sep 5, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+