For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: డియర్.. ఈ శతకం నీకే అంకితం! కన్నుకొట్టి మరి చెప్పిన కోహ్లీ!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సూపర్ సెంచరీని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు అంకితమిచ్చాడు. టీవీ కెమెరాల ముందుకు వచ్చి కన్నుకొట్టి మరి ఈ విషయాన్ని తెలియజేశాడు. తన మెడలోని వెడ్డింగ్ రింగ్‌ను కిస్ చేస్తూ తన సతీమణి అనుష్క శర్మపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దాయాదీ పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్ అంటే చెలరేగిపోయే విరాట్ కోహ్లీ(111 బంతుల్లో 7 ఫోర్లతో 100 నాటౌట్)మరోసారి అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తనపై వచ్చిన విమర్శలకు ఆటతోనే బదులిచ్చాడు. ఒత్తిడిలో.. ఛేజింగ్‌లో తాను ఎంత విలువైన ఆటగాడిననే విషయాన్ని మరోసారి స్పష్టం చేశాడు.

IND vs PAK Virat Kohli s Winking Reaction To Anushka Sharma Goes Viral After Match-Winning Century

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. అనంతరం భారత్ కోహ్లీ శతకంతో 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి గెలుపొందింది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై కోహ్లీ శతకంతో టీమిండియా విజయం సులువైంది. లక్ష్యచేధనలో రోహిత్ శర్మ(20) త్వరగానే ఔటవ్వగా.. శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్ అయ్యర్‌లతో కలిసి కోహ్లీ కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు.. మేనేజ్‌మెంట్ ఇచ్చిన రోల్‌ను సమర్థవంతంగా ప్రోత్సహించాడు. రిస్కీ షాట్స్ ఆడకుండా.. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో పరుగులు రాబట్టాడు.

IND vs PAK Virat Kohli s Winking Reaction To Anushka Sharma Goes Viral After Match-Winning Century

మ్యాచ్ ముగిసే వరకు క్రీజులోనే నిలిచి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ మ్యాచ్‌లో కోహ్లీ శతకం సాధించడం విశేషం. సెంచరీ మార్క్‌తో పాటు భారత్ విజయలాంఛనాన్ని పూర్తి చేసిన వెంటనే కింగ్ కోహ్లీ కెమెరా ముందుకొచ్చి మెడలో ఉన్న వెడ్డింగ్ రింగ్‌కు కిస్ చేశాడు.

ఆ తర్వాత కన్నుకొట్టి ఈ శతకం నీకే అంకితం అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. తన సతీమణి అనుష్క శర్మను ఉద్దేశించే కోహ్లీ ఇలా చేశాడనే విషయం స్పష్టమైంది. అనంతరం అనుష్క శర్మ ఈ పిక్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. 'కోహ్లీ నీ మీ ప్రేమకు దాసోహం అయ్యాను'అనే అర్థంలో చేతులు జోడించిన ఏమోజీలతో పాటు హార్డ్ ఏమోజీని క్యాప్షన్‌గా పేర్కొంది.

Story first published: Monday, February 24, 2025, 10:27 [IST]
Other articles published on Feb 24, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+