
31 పరుగులకే 4 వికెట్లు..
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(4), రోహిత్(4) శర్మ వెను వెంటనే పెవిలియన్ చేరారు. నసీమ్ షా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే కేఎల్ రాహుల్ బంతి వికెట్లపై ఆడుకోని పెవిలియన్ చేరగా.. హారిస్ రౌఫ్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ స్లిప్ క్యాచ్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రెండు బౌండరీలతో దూకుడు కనబర్చాడు. కానీ అతని జోరుకు హరిస్ రౌఫ్ బ్రేక్ వేసాడు. షాట్ పిచ్ బాల్‌తో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా మూడు వికెట్లకు 31 పరుగులు మాత్రమే చేసింది.

వికటించిన ప్లాన్..
ఇక అక్షర్ పటేల్‌ను టాపార్డర్ బ్యాటర్‌గా ప్రమోట్ చేస్తూ టీమ్‌మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం వికటించింది. అక్షర్ పటేల్.. విరాట్ కోహ్లీతో సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ రనౌట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. బంతి కన్నా ముందే రిజ్వాన్ గ్లోవ్స్ వికెట్లను తాకినట్లు కనిపించింది. కానీ అంపైర్ మాత్రం ఔటిచ్చాడు. దాంతో భారత్ 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
ఆదుకున్న విరాట్, హార్దిక్..
ఆత్మరక్షణగా ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిన బౌండరీకి తరలించారు. వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడటంతో భారత్ 10 ఓవర్లలో 4 వికెట్లకు 45 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత జోరు కనబర్చిన ఈ జోడీ.. మహ్మద్ నవాజ్ వేసిన 12 ఓవర్లలో మూడు సిక్స్‌లు బాదారు. ఆ తర్వాత అదే జోరు కనబరుస్తూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. హరీస్ రౌఫ్, నసీమ్ షా 16,17 ఓవర్లు కట్టడిగా వేయడంతో టీమిండియా రిక్వైడ్ రన్‌రేట్ బాగా పెరిగింది. షాహిన్ షా వేసిన 18 ఓవర్లలో విరాట్ కోహ్లీ మూడు బౌండరీలు బాది 17 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
దంచికొట్టిన కోహ్లీ..
ఇక హరిస్ రౌఫ్ వేసిన 19 ఓవర్లో విరాట్ కోహ్లీ రెండు సిక్స్‌లు బాదడంతో 15 పరుగులు వచ్చాయి. దాంతో చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికి హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ సింగిల్ తీయడంతో 4 బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. మూడో బంతికి క్విక్ డబుల్ తీసిన విరాట్ కోహ్లీ... షాదాబ్ వేసిన నోబాల్‌ను సిక్స్‌గా మలిచాడు. దాంతో చివరి మూడు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఫ్రీ హిట్ బాల్‌ను వైడ్‌గా వేయడంతో 3 బంతుల్లో 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే విరాట్ క్లీన్ బౌల్డ్ అవ్వగా.. ఫ్రీహిట్ కావడంతో భారత బ్యాటర్లు 3 పరుగులు తీసుకున్నారు. దాంతో 2 బంతుల్లో 2 పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి దినేశ్ కార్తీక్ స్టంపౌటయ్యాడు. ఆఖరి బంతిని వైడ్‌గా వేయడంతో మ్యాచ్ టై అయ్యింది. ఆఖరి బంతిని అశ్విన్ చాకచక్యంగా సింగిల్ కొట్టడంతో భారత్ విజయం లాంఛనమైంది.


Click it and Unblock the Notifications
