అక్టోబర్‌లోనే 5 సెంచరీలు..
ఇక అక్టోబర్ 23 తేదిన విరాట్ రెండు భారీ ఇన్నింగ్స్ ఆడటం గమనార్హం. 2011 అక్టోబర్ 23న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2015 అక్టోబర్ 22న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 138 పరుగులతో రాణించాడు. 2016 అక్టోబర్ 23న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 154 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2017 అక్టోబర్ 21న వెస్టిండీస్‌తో 140 పరుగులు చేసిన కోహ్లీ.. ఆ మరుసటి రోజే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 121 పరుగులు చేశాడు. 2018 అక్టోబర్ 24న వెస్టిండీస్‌పై 157 పరుగులతో అజేయంగా నిలిచాడు.

గతేడాది పాక్‌పైనా..
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లంతా విఫలమైన వేళ విరాట్ కోహ్లీ ఒక్కడే 57 పరుగులతో రాణించి ఇజ్జత్ కాపాడాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ.. విరాట్ కోహ్లీ రాణించడం అభిమానులను సంతోషపరిచింది.
ఈ క్రమంలోనే నేటి మ్యాచ్‌లోనూ విరాట్ చెలరేగితే భారత్‌కు తిరుగుండదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆసియాకప్ 2022తో ఇటీవలే ఫామ్‌లోకి వచ్చిన అతను అదే జోరును కొనసాగిస్తున్నాడు.

అవహేళన చేస్తూ..
అఫ్గాన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో షాహిన్ అఫ్రిది అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దాంతో డానియల్ అలెగ్జాండర్ అనే నెటిజన్.. షాహీన్ యార్కర్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. టీమిండియాను హేళన చేశాడు. షాహీన్ గుర్జాబ్‌కు విసిరిన బంతి ట్రైలర్ మాత్రమేనని, '152 ప్రాబ్లమ్స్ ఆఫ్ టీమ్ 36'కి అసలు మూవీ అక్టోబర్ 23న దీపావళి సందర్భంగా కనబడుతుంది' అంటూ ట్వీట్ చేశాడు. షాహీన్ గంటకు 152 కిలోమీటర్ల వేగంతో విసిరే బంతులకు 36 పరుగులకు ఆలౌటైన భారత్ (గతంలో ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌లో) నుంచి సమాధానం ఉండదనే ఉద్దేశంతో అతను ఈ ట్వీట్ చేశాడు.

కోహ్లీతో దబిడి దిబిడే..
దీనికి హిమాన్షు పారిక్ అనే భారత స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అక్టోబర్ 21 నుంచి 24వ తేదీ మధ్య 2011 నుంచి కోహ్లీ చేసిన పరుగులను ప్రస్తావించాడు. 2011 అక్టోబర్ 23న ఇంగ్లాండ్‌పై 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ.. గత ఏడాది వరకు చూస్తే.. ఈ తేదీల్లో ఏకంగా ఐదు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు బాదాడని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ గణంకాలనే ప్రస్తావిస్తూ కోహ్లీ ఫ్యాన్స్ పాక్‌కు వార్నింగ్ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications












