For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: టీమిండియా కొంపముంచిన స్పైడ్ కామ్.. షాన్‌ మసూద్‌కు లైఫ్‌లే లైఫ్‌లు!

IND vs PAK: Unlucky Ravichandran Ashwin, spider-cam saves Shan Masood

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్పైడర్ కామ్ భారత జట్టుకు నష్టం చేసింది. క్రీజులో సెట్ అయిన షాన్ మసూద్‌.. స్పైడ్ కామ్‌తో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే చాలా లైఫ్స్ అందుకున్న అతను అశ్విన్ బౌలింగ్‌లో సునాయస క్యాచ్ ఇచ్చాడు. కానీ ఆ బంతి కాస్త స్పైడ్ కామ్ తాకడంతో అంపైర్లు డెడ్‌బాల్‌గా ప్రకటించారు. అశ్విన్ వేసిన 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతను వేసిన నాలుగో బంతి మసూద్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. సునాయస క్యాచ్ అని అంతా భావించారు. కానీ ఆ బంతి కాస్త స్పైడ్ కామ్‌ను తాకడంతో భారత ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఇక ఈ మ్యాచ్‌లో షాన్ మసూద్‌కు చాలా లైఫ్స్ లభించాయి. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విరాట్ కోహ్లీ విసిరిన బంతి వికెట్లను తాకకపోవడంతో మసూద్ తొలి లైఫ్ అందుకున్నాడు. ఆ తర్వాత మహమ్మద్ షమీ వేసిన 8వ ఓవర్‌లో మసూద్ ఇచ్చిన క్యాచ్‌ను అశ్విన్ అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతా ఔటని భావించిన థర్డ్ అంపైర్.. బంతి చేతుల్లో పడే ముందు బౌన్స్ అయినట్లు గుర్తించి నాటౌటిచ్చాడు. ఆ తర్వాత స్పైడ్ కామ్‌తో బచాయించిన అతను.. ఆ మరుసటి బంతికి ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అశ్విన్ అందుకోలేకపోయాడు. దాంతో షాన్ మసూద్‌కు లక్ మాములుగా లేదు కదా? అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు అర్ష్‌దీప్ గట్టి షాకిచ్చాడు. తన వరుస ఓవర్లలో బాబర్ ఆజామ్(0), మహమ్మద్ రిజ్వాన్(0)లను ఫెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో మసూద్‌తో కలిసి ఇఫ్తికర్ చెలరేగాడు. హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మూడు భారీ సిక్స్‌లు బాది జోరు కనబర్చిన అతన్ని షమీ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాదాబా ఖాన్(5), హైదర్ అలీ(2)లను హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్‌లో షార్ట్ బాల్స్‌తో బోల్తా కొట్టించాడు. అదే జోరులో తన చివరి ఓవర్‌లో మహమ్మద్ నవాజ్‌(9)ను కూడా హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ(2)ని అర్ష్‌దీప్ సింగ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడంతో పాక్ 120 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది.

Story first published: Sunday, October 23, 2022, 15:18 [IST]
Other articles published on Oct 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+