పాకిస్థాన్‌తో మ్యాచ్.. తడబడిన భారత్!
IND vs PAK:అండర్ 19 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడ్డారు. పాకిస్థాన్ బౌలర్ల ధాటిగా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులే చేసింది.
ఓపెనర్ ఆదర్శ్ సింగ్(81 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 62), ఉదయ్ సహరన్(98 బంతుల్లో 5 ఫోర్లతో 60), సచిన్ దిహాస్(42 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు.
పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ జీషాన్(4/46) నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఆమిర్ హస్సన్, ఉబైద్ షా తలో రెండు వికెట్లు తీసారు. అరఫట్ మిన్హాస్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ షామిల్ హుస్సెన్(8)ను అభిషేక్ పెవిలియన్ చేర్చినా.. మరో ఓపెనర్ షెహ్‌జైబ్ ఖాన్(51 బ్యాటింగ్), అజాన్ అవైస్(41 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు. పాకిస్థాన్ విజయానికి 156 బంతుల్లో 144 పరుగులు కావాలి.
ఆదుకున్న ఉదయ్, ఆదర్శ్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి(24), రుద్రపటేల్(1) వరుసగా పెవిలియన్ చేరారు. దాంతో టీమిండియా 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ ఉదయ్ సహరణ్,ఆదర్ష్ సింగ్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు.
దెబ్బతీసిన ఉబైద్..
హాఫ్ సెంచరి పూర్తి చేసుకొని శతకం దిశగా సాగుతున్న ఆదర్శ్ సింగ్‌ను అర్ఫత్ మిన్‌హస్ ఔట్ చేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ముషీర్ ఖాన్(2), కీపర్ అరవెల్లీ అవనిష్(11) కూడా పెవిలియన్ చేరారు. ఈ పరిస్థితుల్లో సచిన్ ధాస్‌తో కలిసి ఉదయ్ సహరణ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించిన అనంతరం భారత కెప్టెన్‌ను ఉబైద్ షా ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు.
చివర్లో బ్యాటింగ్‌కు దిగిన మురుగణ్ అభిషేక్(4), రాజ్ లింబాని(7) కూడా వెనుదిరగడంతో సచిన్ దాస్ ఒంటరివాడయ్యాడు. భారీ షాట్ ఆడే క్రమంలో అతను కూడా చివరి ఓవర్‌లో వెనుదిరిగాడు. సౌమి పాండే(8 నాటౌట్), నమన్ తీవారీ(2 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి భారత ఇన్నింగ్స్‌ను ముగించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications