For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్చ్.. పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం!

IND vs PAK: దాయాదీ పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. అండర్ 19 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పేలవ బ్యాటింగ్‌కు చెత్త బౌలింగ్ తోడవ్వడంతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అండర్ 19 ఆసియా కప్ అయినా.. పాకిస్థాన్‌తో పోరు కావడంతో భారత అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్‌ను చూశారు.

చివరకు పరాజయం ఎదురవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులే చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్(81 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 62), ఉదయ్ సహరన్(98 బంతుల్లో 5 ఫోర్లతో 60), సచిన్ దిహాస్(42 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు.

IND vs PAK, Under-19s Asia Cup: Azan Awais shines as Pakistan beat India by

పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ జీషాన్(4/46) నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఆమిర్ హస్సన్, ఉబైద్ షా తలో రెండు వికెట్లు తీసారు. అరఫట్ మిన్హాస్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ 47 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. అజాన్ అవైస్(130 బంతుల్లో 10 ఫోర్లతో 105 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. సాద్ బైగ్(51 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 68 నాటౌట్), షెహ్‌జైబ్ ఖాన్(88 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మురుగణ్ అభిషేక్(2/55) ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Sunday, December 10, 2023, 19:22 [IST]
Other articles published on Dec 10, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+