For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ind vs Pak T20 World Cup: అందుకే ఓడాం: విరాట్ కోహ్లీ

Virat Kohli says We didnt execute properly

దుబాయ్: తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయకపోవడంతో పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మంచుతో పాటు పాకిస్థాన్ అద్భుత ప్రదర్శన తమ జట్టు పతనాన్ని శాసించిందన్నాడు. ఆరంభం నుంచి మ్యాచ్ ముగిసే వరకు పాక్ ఆటగాళ్లు తమపై ఆధిపత్యం చెలాయించారని, వారి అద్భుత ఆటతీరుకు తలవంచక తప్పలేదని విరాట్ చెప్పుకొచ్చాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన విరాట్ కోహ్లీ.. టోర్నీలో ఇదే చివరి మ్యాచ్ కాదని, తప్పిదాలను సరిదిద్దుకొని తదుపరి మ్యాచ్‌ల్లో రాణిస్తామని చెప్పుకొచ్చాడు.

క్రెడిట్ 'మంచు'దే..

క్రెడిట్ 'మంచు'దే..

'మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. పాకిస్థాన్ అద్భుత ప్రదర్శనతో పాటు మంచి మా ఓటమిని శాసించింది. పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఆరంభంలోనే 20 పరుగుల్లోపే మూడు కీలక వికెట్లు తీసి మాపై పై చేయి సాధించారు. అయితే మేం మాత్రం అలా ఆరంభంలో వికెట్లు తీయలేకపోయాం. వారు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ మాకెలాంటి అవకాశాలు ఇవ్వలేదు. అయితే మా బ్యాటింగ్ సమయంలో ఫస్టాఫ్ మేం చాలా నెమ్మదిగా ఆడాం.

పాక్ అద్భుతంగా ఆడింది..

పాక్ అద్భుతంగా ఆడింది..

పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో షాట్లు ఆడటం కష్టమైంది. అయితే 10 ఓవర్ల తర్వాత మేం కొంచెం వేగం పెంచాం. కానీ పాక్ బౌలర్లు మా జోరుకు బ్రేక్ చేశారు. ఓ 15-20 పరుగులు ఎక్కువ చేయాల్సిన స్థితిలో వికెట్లు తీసి మమ్మల్ని అడ్డుకున్నారు. మరో స్లో బౌలర్‌ను తీసుకోవాల్సిందనే చర్చ మా మధ్య జరిగింది. కానీ మంచు ఉన్నప్పుడు స్లో బౌలర్లు ప్రభావం చూపలేరు. అయితే టోర్నీలో ఇదే ఫస్ట్ మ్యాచ్. చివరి మ్యాచ్ కాదు. తప్పిదాలను సరిదిద్దుకొని బరిలోకి దిగుతాం.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

జర్నలిస్ట్‌పై ఫైర్

జర్నలిస్ట్‌పై ఫైర్

ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కోహ్లీ.. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమ్ కాంబినేషన్‌ గురించి అతను అడగ్గా.. వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దని చురకలంటించాడు. రోహిత్ శర్మను పక్కనపెట్టాల్సిందా? అని ప్రశ్నించాడు. వామప్ మ్యాచ్‌లో రోహిత్ ఆడింది చూడలేదా? అని నిలదీశాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(3), రోహిత్ శర్మ(0), సూర్యకుమార్ యాదవ్(11) దారుణంగా విఫలమవ్వగా.. విరాట్ కోహ్లీ(49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. రిషభ్ పంత్(30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) పర్వాలేదనిపించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయగా.. హసన్ అలీ, షాదాబ్ ఖాన్, హ్యారిస్ రౌఫ్ చెరొక వికెట్ తీశారు.

ఆడుతూ పాడుతూ..

ఆడుతూ పాడుతూ..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ ఆడుతూ పాడుతూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయాన్నందుకుంది. ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 నాటౌట్), బాబర్ ఆజామ్ (52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 17.5 ఓవర్లలో 152 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కనీసం ఒక్క వికెట్ తీయలేకపోయారు.

ముఖ్యంగా పేసర్లు భువనేశ్వర్ కుమార్(0/25), మహమ్మద్ షమీ(0/43), జస్‌ప్రీత్ బుమ్రా(0/22),వరుణ్ చక్రవర్తీ(0/33), రవీంద్ర జడేజా(0/28) పోటీపడి పరుగులిచ్చుకున్నారు. మహమ్మద్ షమీ పూర్తిగా తేలిపోయాడు. ఈ ఓటమితో భారత్.. టైటిల్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. టోర్నీలో ముందుకు సాగాలంటే.. ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.

Story first published: Monday, October 25, 2021, 7:21 [IST]
Other articles published on Oct 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+