Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Pakistan: దుమ్మురేపిన టీఆర్‌పీ రేటింగ్స్.. స్టార్ స్పోర్ట్స్‌కు పైసలే పైసల్!

 Blockbuster TRP Ratings

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌తో స్టార్ స్పోర్ట్స్ పంట పండింది. ఈ బిగ్ మ్యాచ్‌ కోసం యావత్ దేశం టీవీలకు అతుక్కుపోయింది. దాంతో టీఆర్‌పీ రేటింగ్స్‌లో స్టార్ స్పోర్ట్స్ దుమ్మురేపింది. ఎన్నడు లేని రికార్డ్స్‌ను నమోదు చేసింది. ఇక హాట్ స్టార్‌లో అయితే ఏకంగా కోటి మంది ఈ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఈ సంఖ్య 75 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు కోటీ రావడం విశేషం. ఈ సంఖ్య ఇంకా పెరిగే చాన్స్ ఉంది.

అయితే 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీస్‌ను 25.3 మిలియన్ల మంది వీక్షించారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అయితే మ్యాచ్ భారత్‌వైపు మళ్లీతే ఈ సంఖ్యను బీట్ చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న భారత్-పాక్ బజ్‌ను స్టార్ స్పోర్ట్స్ క్యాష్ చేసుకుంటుంది. బ్రాడ్ కాస్టింగ్ రైటింగ్స్ సంబంధించిన డబ్బుల్లో సగాన్ని ఈ మ్యాచ్‌తోనే పిండుకుంటుంది. ఈ మ్యాచ్ ద్వారా స్టార్ భారీ మొత్తంలో అడ్వర్టైజింగ్ రెవెన్యూ అందుకుంటుంది. ఈ మెగా మ్యాచ్ మధ్యలో వచ్చే యాడ్స్‌కు ఇప్పటికే భారీ రేటు ఫిక్స్ చేసింది.

పది సెకన్ల యాడ్ స్లాట్‌కు రూ.25-30 లక్షల వరకు వసూలు చేస్తుందని ఇప్పటికే యాడ్ వర్గాలు పేర్కొన్నాయి. దానికి తగ్గట్లుగానే చాలా బ్రాండ్స్ యాడ్స్‌ను స్టార్ స్పోర్ట్స్ ఇస్తుంది. స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు సంబంధించి భారత టెలివిజన్ చరిత్రలోనే ఓ యాడ్‌కు ఇంత మొత్తం వసూలు చేయడం ఇదే తొలిసారి. యాడ్ ధర భారీగా ఉన్నప్పటికీ ఈ మెగా మ్యాచ్ మధ్యలో ప్రకటనలు ఇచ్చేందుకు కంపెనీలు ఎగబడ్డాయి.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(3), రోహిత్ శర్మ(0), సూర్యకుమార్ యాదవ్(11) దారుణంగా విఫలమవ్వగా.. విరాట్ కోహ్లీ(49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 57), రిషభ్ పంత్(30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39)రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయగా.. హసన్ అలీ, షాదాబ్ ఖాన్, హ్యారిస్ రౌఫ్ చెరొక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ సమయోచితంగా ఆడుతుంది. ఓపెనర్లు బాబర్ ఆజామ్(20), రిజ్వాన్(31) మంచి శుభారంభాన్ని అందించారు.

Story first published: Sunday, October 24, 2021, 22:25 [IST]
Other articles published on Oct 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+