Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ఆప్షనల్ ట్రైనింగ్ ఏందిరా అయ్యా.. అక్కడికి వెళ్లింది పండుకోనికా? టీమిండియాపై గవాస్కర్ ఫైర్!

IND vs PAK: Sunil Gavaskar slams Team India, I don’t understand this optional training concept

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా అప్రోచ్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌తో ఆదివారం జరగనున్న హైఓల్టేజ్ మ్యాచ్ ముందు భారత ఆటగాళ్లకు ఆప్షనల్ ట్రైనింగ్ ఇవ్వడాన్ని తప్పుబట్టాడు. ఈ ఆప్షనల్ ట్రైనింగ్ విధానమే సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాకు వెళ్లింది ప్రపంచకప్ గెలవడానికా? లేక ప్రాక్టీస్ చేయకుండా పండుకోనికా? అని ప్రశ్నించాడు. మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్-పాక్ మ్యాచ్ జరగనుండగా.. శుక్రవారం భారత ఆటగాళ్లలో చాలా మంది ప్రాక్టీస్‌కు రాలేదు.

 ఇదెక్కడి దిక్కుమాలిన విధానం..

ఇదెక్కడి దిక్కుమాలిన విధానం..

ట్రైనింగ్‌కు ఆప్షనల్ డే కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్‌తో కొద్ది మంది మాత్రమే నెట్స్‌లో శ్రమించారు. ఇదే విషయం సునీల్ గవాస్కర్‌కు ఆగ్రహం తెప్పించింది. బిగ్ మ్యాచ్ ముందు ప్రాక్టీస్ చేయకుండా ఆటగాళ్లకు ఆప్షన్ ఇవ్వడం ఏందని ప్రశ్నించాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ టీమ్‌మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టాడు. 'ఈ విధానంతో ఏం చెప్పదల్చుకున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనైతే ఈ విధానాన్ని ఏ మాత్రం అంగీకరించను.

ఏం ఆడకుండానే..

ఏం ఆడకుండానే..

ఎందుకంటే టోర్నీ ప్రారంభానికి ముందు జరగాల్సి వామప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మెల్‌బోర్న్ వచ్చిన రోజు కూడా ప్రయాణం కారణంగా ప్రాక్టీస్ చేయలేదు. ఆ తర్వాతి రోజు కూడా ప్రాక్టీస్ చేయకపోవడం ఏంది?. ఆప్షనల్ ట్రైనింగ్ విధానం సరైంది కాదు. ఇది కెప్టెన్, కోచ్‌కు మాత్రమే ఉండాలి. వారే ప్రాక్టీస్ రాలేని వారికి అనుమతివ్వాలి. అంతేకానీ ఆటగాళ్ల ప్రాక్టీస్ విషయంలో వారిని ఇష్టానుసారం వదిలేయకూడదు. ఓ బ్యాటర్ ముందు మ్యాచ్‌లో సెంచరీ చేసి అలిసిపోతే.. కెప్టెన్ అనుమతితో ప్రాక్టీస్ రాకున్నా ఏం కాదు.

బిగ్ మ్యాచ్ ముందు పడుకోవడం ఏంటీ..

బిగ్ మ్యాచ్ ముందు పడుకోవడం ఏంటీ..

బౌలర్ 20-30 ఓవర్లు బౌలింగ్ చేసి భుజం నొప్పికి గురైతే.. అతను కూడా కెప్టెన్ పర్మీషన్‌తో ప్రాక్టీస్ రాకున్నా ఏం కాదు. కానీ కెప్టెన్, కోచ్‌కు సంబంధం లేకుండా ఆప్షనల్ ప్రాక్టీస్ పేరిట ఆటగాళ్లందరినీ రూమ్‌లోపడుకోబెట్టడం ఏమాత్రం భావ్యం కాదు. మెగా టోర్నీలో రాణించాలంటే ఆటగాళ్లు ఎప్పుడూ రిథమ్‌లో ఉండాలి. ప్రాక్టీస్ సెషన్‌ల ద్వారానే ఆటగాళ్లు రిథమ్ కోల్పోకుండా ఉంటారు.

 9.30కే గ్రౌండ్‌లోకి..

9.30కే గ్రౌండ్‌లోకి..

శుక్రవారం ఇష్టం ఉన్నవాళ్లు ప్రాక్టీస్‌కు రాగా.. శనివారం మాత్రం అందరూ నెట్స్‌కు వచ్చారు. ఉదయం 9.30 నుంచే నెట్స్‌లో శ్రమిస్తున్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఆటగాళ్లంతా చెమటోడ్చుతున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు అన్ని విధాల సిద్దమవుతున్నారు. విరాట్ కోహ్లీ రివర్స్ స్వీప్ షాట్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇక భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. కోహ్లీ ప్రాక్టీస్ చేస్తుండగా.. మాతృఝే సలామ్ అంటూ పాటలు పాడారు. ప్రస్తుతం ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి

Story first published: Saturday, October 22, 2022, 14:10 [IST]
Other articles published on Oct 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+