Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sourav Ganguly: పాకిస్థాన్‌పై భారత్‌తే విజయం.. ఆధిపత్యం 13-0గా మారుతోంది!

Sourav Ganguly says Huge possibility of 13-0 ahead of India vs Pakistan clash in T20 World Cup
Ind vs Pak: ఆటగాళ్లంతా మ్యాచ్ విన్నర్లే.. Pak కంటే వారికే అడ్వాంటేజ్- Sourav Ganguly|Oneindia Telugu

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తుందని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. మెగాటోర్నీల్లో దాయాదీ దేశంపై భారత్ ఆధిపత్యం కొనసాగుతుందని, అది 13-0గా మారుతుందని ధీమా వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రెండు దయాదీ దేశాల మధ్య ఆదివారం దుబాయ్ వేదికగా మెగా పోరు జరగనున్న విషయం తెలిసిందే. ఈ హైఓల్టెజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంది. ఇక ప్రపంచకప్‌ల్లో పాక్‌పై భారత్‌కు తిరుగులేదు. టీ20 అయినా, వన్డే అయినా భారత్‌దే పై చేయి. అయితే ఈ సారి ఆ లెక్కను సరిచేస్తుందని పాక్ మాజీ క్రికెటర్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.

భారత్‌దే విజయం..

భారత్‌దే విజయం..

తాజాగా ఏబీపీ న్యూస్‌ దుబాయ్ వేదికగా నిర్వహించిన 'విశ్వ విజేత సదస్సు 2021' కార్యక్రమంలో దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి గంగూలీ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా దాయాదుల పోరుపై మాట్లాడిన గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్‌పై భారత్ ఆధిపత్యం కొనసాగుతుందని అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా..'అవును.. ప్రపంచకప్ వేదికల్లో పాక్‌పై ఉన్నఆధిపత్యాన్ని భారత్ కొనసాగిస్తుంది.

అది 13-0గా మారవచ్చు. భారత జట్టులో ఉన్న ఆటగాళ్లంతా మ్యాచ్ విన్నర్లే. ఈ జట్టు 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టైటిల్ సాధిస్తుంది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నా.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు. 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్ ఆ తర్వాత మళ్లీ టైటిల్ అందుకోలేకపోయింది.

బుమ్రా మ్యాచ్ విన్నర్..

బుమ్రా మ్యాచ్ విన్నర్..

ఇక గంగూలీ వ్యాఖ్యలకు మద్దతుగా దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడారు. 'మెగా టోర్నీలో భారత జట్టే ఫేవరేట్. భారత ఆటగాళ్లు ఇటీవలే ఇదే వేదికగా ముగిసిన ఐపీఎల్ ఆడారు. కాబట్టి పాకిస్థాన్ కంటే వారికి కొంచెం అడ్వాంటేజ్ ఉంది.'అని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. ఇక దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ.. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషిస్తాడన్నాడు.

'ఓ బౌలర్‌గా బుమ్రా ఈ టోర్నీలో ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నా. వికెట్లు తీయడం, జట్టును గెలిపించే బాధ్యతలను బుమ్రా తీసుకోవాలనుకుంటున్నా. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలవాలని ఆశిస్తున్నా. జట్టులో ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాడిగా రాణించే సత్తా అతనిలో ఉంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఫలితాన్ని అతను శాసిస్తాడు'అని కపిల్ చెప్పుకొచ్చాడు.

ధోనీతోనే భయం..

ధోనీతోనే భయం..

టీమిండియా మెంటార్‌గా ధోనీ ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ అన్నాడు. 'ధోనీలాంటి ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే ప్రతర్థి జట్టు భయపడక తప్పదు. మేం ఆడేటప్పుడు కూడా ధోనీ ప్రభావం ఉండేది. హై ఓల్టేజ్ గేమ్‌లో పరిస్థితులను ప్రశాంతంగా డీల్ చేయగల సత్తా అతని సొంతం.

ఇప్పటికే అతను ఎన్నో టైటిల్స్ సాధించాడు. అతను మెంటార్‌గా ఉండటం టోర్నీలో భారత జట్టుకు కలిసొచ్చే అంశం. పాకిస్థాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే.. టీ20 ప్రపంచకప్‌లో ఉన్న 5-0 రికార్డును.. ఈ మ్యాచ్‌తో 5-1 చేయాలని కోరుకుంటున్నా. అయితే భారత్-పాక్ మ్యాచ్ తీవ్ర ఒత్తిడితో కూడుకున్నది. ఎవరూ ఒత్తిడి అధిగమించి తమ ప్రణాళికలను అమలు చేస్తారో వారే విజేతలుగా నిలుస్తారు.'అని యూనిస్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.

ప్రపంచకప్ వేదికల్లో పాకిస్థాన్ ఇప్పటి వరకు భారత్‌ను ఓడించలేదు. వన్డే ప్రపంచకప్‌ల్లో ఏడు సార్లు, టీ20 ప్రపంచకప్‌ల్లో ఐదు సార్లు ఓటమిపాలైంది. అయితే 2017 చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారత్‌కు పాక్ షాకిచ్చింది. అయితే ఈ ఇదరు జట్ల ఆటగాళ్లు పీఎస్‌ఎల్, ఐపీఎల్ కారణంగా దుబాయ్‌లో చాలా మ్యాచ్‌లు ఆడారు.

Story first published: Friday, October 22, 2021, 19:02 [IST]
Other articles published on Oct 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+