IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు బిగ్ షాక్!
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. శనివారం ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతని చేతికి బలంగా తాకింది. దాంతో గిల్ నొప్పితో విలవిలలాడాడు. పక్కనే ఉన్న కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. గిల్‌తో మాట్లాడారు.
అభిషేక్ శర్మ వాటర్ బాటిల్‌ను అందించగా.. ఫిజియో వచ్చి శుభ్‌మన్ గిల్‌ను బయటకు తీసుకెళ్లాడు. మ్యాచ్ సమయానికి శుభ్‌మన్ గిల్ ఫిట్‌గా ఉంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. గిల్ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఏడాది తర్వాత భారత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. యూఏఈతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఒకవేళ శుభ్‌మన్ గిల్ జట్టుకు దూరమైతే.. రింకూ సింగ్ లేదా అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 26 ఏళ్ల శుభ్‌మన్ గిల్ ఇప్పటి వరకు 114 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 46.30 యావరేజ్‌తో 6026 పరుగులు చేశాడు. ఇందులో 18 శతకాలతో పాటు 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications