Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ఐర్లాండ్ ఆంటీతో శిఖర్ ధావన్ డేటింగ్.. పాక్‌తో మ్యాచ్‌లో మెరిసిన మిస్టరీ వుమెన్! (వీడియో)

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ ప్రేమలో పడ్డాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సతీమణి ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్.. ప్రస్తుతం ఐర్లాండ్‌కు చెందిన ఓ మహిళతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత మ్యాచ్‌లకు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి శిఖర్ ధావన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

India vs Pakistan Live స్కోరు కార్డు

హాలీవుడ్ హీరోయిన్‌లా..
బంగ్లాదేశ్‌తో భారత తొలి మ్యాచ్‌కు శిఖర్ ధావన్ సదరు ఐర్లాండ్ మహిళతో హాజరయ్యాడు. దాంతో ఈ ఇద్దరి డేటింగ్ వార్తలు బయటకు వచ్చాయి. ఆ ఐర్లాండ్ మహిళకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు కూడా శిఖర్ ధావన్.. ఆ ఐర్లాండ్ మహిళతో హాజరయ్యాడు. ధావన్ పక్కనే కూర్చొని సదరు మహిళ మ్యాచ్ చూస్తుండటం విశేషం. ఆ ఐర్లాండ్ మహిళా పేరు సోఫీ షైన్‌గా నెటిజన్లు గుర్తించారు. శిఖర్ ధావన్ కూడా ఆమెను సోషల్ మీడియాలో ఫాలో చేస్తున్నాడు. సోఫీ షైన్‌.. హాలీవుడ్ హీరోయిన్‌ను తలపిస్తోంది. అయితే ఈ ఇద్దరి డేటింగ్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

IND vs PAK Shikhar Dhawan s Picture With Mystery Woman At Champions Trophy 2025 Goes Viral

ఆంటీలంటేనే గబ్బర్‌కు ప్రేమ..
శిఖర్ ధావన్ తన మాజీ సతీమణి ఆయేషా ముఖర్జీని కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. తన కంటే 10 ఏళ్లు పెద్దదైనా ఆయేషాతో ధావన్‌కు ఫేస్ బుక్ వేదికగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆస్ట్రేలియా పౌరురాలు, అప్పటికే పెళ్లైన ఆయేషా‌ను శిఖర్ ధావన్ ఇంట్లో వాళ్లతో గొడవపడి పెళ్లి చేసుకున్నాడు. ఆమె కోసం 2009లో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ధావన్.. కొన్నాళ్లు లివింగ్ రిలేషన్‌లో ఉన్నాడు.

12 ఏళ్ల తర్వాత విడాకులు..
2012 లో సిక్కు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో శిఖర్ ధావన్ భారత జట్టు తరపున అరంగేట్రం చేశాడు. పెళ్లి తర్వాత ఆయేషా ఇండియాలోనే నివసించింది. శిఖర్ ధావన్ కోసం ఆయేషా తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆయేషా‌కు మొదటి వివాహం ద్వారా ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. 2013 డిసెంబర్‌లో ఈ జోడీ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అతని పేరు జొరావర్. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ జోడీ గతేడాది విడిపోయింది. తమ 12 ఏళ్ల వివాహ బంధానికి గుడ్‌బై చెప్పింది. తన కొడుకు జొరావర్‌ను ఆయేషా కుటుంబం కలవనిస్తలేదని ధావన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Story first published: Sunday, February 23, 2025, 17:58 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+