IND vs PAK: షాహిన్ అఫ్రిది తొండాట.. ఛీటర్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ(111 బంతుల్లో 7 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాటకీయ పరిణామాల మధ్య బౌండరీతో సెంచరీ మార్క్ అందుకోవడంతో పాటు భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
అయితే ఈ మ్యాచ్‌లో షాహిన్ అఫ్రిది ఉద్దేశపూర్వకంగా కోహ్లీ సెంచరీని అడ్డుకు ప్రయత్నం చేశాడు. టీమిండియా విజయం ముంగిట ఒకే ఓవర్‌లో మూడు వైడ్ బాల్స్ వేసాడు. దాంతో అభిమానులు లూజర్, లూజర్ అంటూ ఎగతాళి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. అనంతరం భారత్ కోహ్లీ శతకంతో 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(20) త్వరగానే ఔటవ్వగా.. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లతో కలిసి కోహ్లీ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ(85 పరుగుల వద్ద) సెంచరీ ముంగిట అయ్యర్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన హార్దిక్ వరుసగా రెండు బౌండరీలు బాది ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ కోహ్లీ సెంచరీకి సహకరించడాడు. ఆ సమయంలో కోహ్లీ సెంచరీకి 14 పరుగులు అవసరమవ్వగా.. భారత్ విజయానికి 18 పరుగులు కావాల్సి వచ్చింది.
రోహిత్ సైగలతో..
ఈ క్రమంలో 42వ ఓవర్ వేసిన షాహిన్ షా అఫ్రిది ఉద్దేశపూర్వంగా మూడు వైడ్లు వేసాడు. దాంతో కోహ్లీ సెంచరీ చేయడం కష్టంగా మారింది. అక్షర్ పటేల్ సింగిల్ తీసి కోహ్లీకి స్ట్రైక్ ఇవ్వగా.. అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎందుకు సింగిల్? అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఈ సమయంలోనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి కోహ్లీకి రోహిత్ సిక్సర్‌తో సెంచరీ కొట్టాలని సైగలు చేశాడు. భారత్ విజయానికి 2 పరుగులు.. కోహ్లీ సెంచరీకి 4 పరుగులు చేయాల్సి వచ్చింది. అనంతరం కోహ్లీ బౌండరీ బాది సెంచరీతో పాటు భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఉద్దేశపూర్వకంగా కోహ్లీ సెంచరీని అడ్డుకునే ప్రయత్నం చేసిన షాహిన్ షా అఫ్రిదిపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోతున్నామనే కుళ్లుతో అఫ్రిది తొండాట ఆడాడని, క్రీడాస్పూర్తి మరిచి ఉద్దేశపూర్వకంగా వైడ్ బాల్స్ వేసాడని మండిపడుతున్నారు.
SHAHEEN AFRIDI BOWLING WIDES.
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025
- Dubai crowd chanting 'loser, loser'. pic.twitter.com/PcWfVj9Haw
Captain Rohit Sharma hugging and congratulating Virat Kohli. 🥹❤️ pic.twitter.com/M8Zabyb0ot
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications