Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: అందుకే రిషభ్ పంత్‌ను పక్కనపెట్టాం: రోహిత్ శర్మ

Rohit Sharma Reveals Why Rishbah Pant

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలవగానే మ్యాచ్ గెలిచినంత సంతోషం అభిమానుల్లో కనిపించింది. టాస్ రోహిత్ గెలిచాడని తెలియగానే గట్టిగా అరుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక రోహిత్ శర్మ మాత్రం తాము టాస్‌కు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇక్కడికి మంచి క్రికెట్ ఆడాలని వచ్చామని చెప్పాడు. ఇక్కడ ఐపీఎల్ ఆడిన అనుభవం ఉందని, పిచ్ అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పాడు.

పిచ్ కండిషన్స్, టీమ్ కాంబినేషన్ నేపథ్యంలో రిషభ్ పంత్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందని హిట్ మ్యాన్ వివరణ ఇచ్చాడు. అతని స్థానంలో దినేశ్ కార్తీక్‌ను తీసుకున్నామని తెలిపాడు. అలాగే మూడో పేసర్‌గా ఆవేశ్ ఖాన్ బరిలోకి దిగుతున్నాడని తెలిపాడు. ఈ మ్యాచ్‌ తమకు చాలా ముఖ్యమని చెప్పిన రోహిత్.. పాకిస్థాన్‌ను ప్రత్యేకంగా చూడటం లేదన్నాడు. గతంలో చేసిన తప్పిదాలను సరిదిద్దాలనుకుంటున్నామని చెప్పాడు. ఆ క్రమంలోనే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నానని తెలిపాడు. మిగతా జట్టులో పెద్దగా మార్పులేమి జరగలేదు.

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేసేవాళ్లమని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. అయితే టాస్ మన చేతుల్లో లేని విషయమని, భారీ స్కోర్ చేసేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ముగ్గు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పిన బాబర్.. నసీమ్ షా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడని పేర్కొన్నాడు. కొత్త, పాత ముఖాలతో పర్ఫెక్ట్ కాంబినేషన్‌తో భారత్‌ను ఎదుర్కొంటున్నామని తెలిపాడు. తమ సాయశక్తులా విజయం కోసం కృషి చేస్తామన్నాడు.

ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 100 మ్యాచ్‌ల మైలురాయిని అధిగమించాడు. మూడు ఫార్మాట్‌లలోనూ (టెస్టు, వన్డే, టి20) కనీసం 100 మ్యాచ్‌ల చొప్పున ఆడిన రెండో క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు.న్యూజిలాండ్‌ ప్లేయర్‌ రాస్‌ టేలర్‌ తొలిసారి ఈ ఘనతను అందుకోగా విరాట్ అతని సరసన చేరాడు. భారత్, పాక్‌ మధ్య 9 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. ఆరింటిలో భారత్, రెండింటిలో పాక్‌ గెలిచాయి. మరో మ్యాచ్‌ 'టై' అయింది.

తుది జట్లు

భారత్: రోహిత్‌‌ శర్మ‌‌ (కెప్టెన్‌‌), కేఎల్ రాహుల్‌‌, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్‌ యాదవ్‌, దినేశ్ కార్తీక్, హార్దిక్‌‌ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, ఆవేశ్‌‌ ఖాన్‌, యుజ్వేంద్ర చాహల్‌‌, అర్ష్‌‌దీప్‌ సింగ్‌, ఆవేశ్ ఖాన్

పాకిస్తాన్‌‌: బాబర్‌‌ (కెప్టెన్‌‌), రిజ్వాన్‌‌, ఫఖర్‌‌, ఇఫ్తికర్‌‌, కుష్దిల్‌‌ షా, ఆసిఫ్‌‌ అలీ, షాదాబ్‌‌ ఖాన్‌‌, మహ్మద్‌‌ నవాజ్‌‌, నసీమ్ షా, హారిస్ రవూఫ్, షానవాజ్‌‌ దహాని

Story first published: Sunday, August 28, 2022, 19:29 [IST]
Other articles published on Aug 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+