Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: అందుకే తుది జట్టులో మార్పులు చేయలేదు: రోహిత్ శర్మ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పాకిస్థాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. భారీ లక్ష్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నాం. ఐసీసీ టోర్నీల్లో ప్రతీ మ్యాచ్ కీలకమే. పరిస్థితులను మేం సాధారణంగా ఉంచాలనుకుంటున్నాం.

మా కుర్రాళ్లకు ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఇప్పటికే ఇక్కడ మేం మెరుగైన విజయాలు సాధించాం. ఈ రోజు మా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలనుకుంటున్నాం. గత మ్యాచ్‌లో మేం ఓడాం. కానీ అది గతం. జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. ఫకార్ జమాన్ స్థానంలో ఇమామ్ జట్టులోకి వచ్చాడు.'అని మహమ్మద్ రిజ్వాన్ తెలిపాడు.

IND vs PAK Rohit Sharma reveals the reason why India playing xi unchanged vs Pakistan in Champions Trophy 2025
Photo Credit: BCCI

మరోవైపు టాస్ పెద్ద విషయమే కాదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 'టాస్ పెద్ద విషయం కాదు. పాక్ టాస్ గెలిచింది కాబట్టి మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. గత మ్యాచ్ తరహాలోనే పిచ్ నెమ్మదిగా కనిపిస్తోంది. మాకు అనుభవం కలిగిన బ్యాటింగ్ లైనప్ ఉంది. నెమ్మదైన వికెట్‌పై ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. బంతితో పాటు బ్యాట్‌తో సమష్టి ప్రదర్శన చేయడం ముఖ్యం. గత మ్యాచ్‌లో మాకు సునాయసంగా విజయం దక్కలేదు.

ఒత్తిడి ఉన్నప్పుడే ఆటగాళ్ల సత్తాకు పరీక్ష. మేం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం. గత మ్యాచ్ మాదిరే పిచ్ కండిషన్స్‌ ఉండటం, విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చే ఉద్దేశం లేకపోవడంతోనే తుది జట్టులో మార్పులు చేయలేదు'అని రోహిత్ శర్మ తెలిపాడు.

వన్డేల్లో టీమిండియా వరుసగా 12వ సారి టాస్ ఓడిపోయింది. ఈ ఫార్మాట్‌లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో నెదర్లాండ్స్(11) పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించి అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ విజయం సాధిస్తే టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారు కానుంది. మరోవైపు పాకిస్థాన్ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.

Take a Poll

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా

పాకిస్థాన్: బాబర్ ఆజామ్, ఇమాముల్ హక్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహీర్, ఖుష్‌దిల్ షా, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, హారిస్ రౌఫ్, నసీమ్ షా.

Story first published: Sunday, February 23, 2025, 14:21 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+