Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్.. ఇక షాహిన్ అఫ్రిదికి దబిడి దిబిడే!

IND vs PAK: Rohit Sharma ready with master plan for Shaheen Afridi challenge in T20 World Cup 2022

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌కు టీమిండియా సన్నదమైంది. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న ఈ మెగా పోరుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్‌తో రెడీ అయ్యాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఘోర పరాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలను సిద్దం చేస్తున్నాడు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిదిని ధీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అయ్యాడు.

గంటన్నరపాటు నెట్స్‌లో..

గంటన్నరపాటు నెట్స్‌లో..

ఈ క్రమంలోనే శుక్రవారం అతను నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో కొత్త బంతితో షాహీన్‌ అఫ్రిది పేస్‌, స్వింగ్‌ను ఛేదించాలంటే అడ్డంగా షాట్లు ఆడకూడదని అతను నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. శుక్రవారం జరిగిన ఈ ప్రాక్టీస్‌ సెషన్లో రోహిత్‌ గంటన్నర పాటు కఠోరంగా సాధన చేశాడు. మైదానంలో 'వి' ఆకారంలో ఉండే స్థానాల్లోనే అతడు ఎక్కువగా షాట్లు ఆడాడు. శుక్రవారం ప్రాక్టీస్‌కు ఆప్షనల్ అయినా.. షాహిన్‌కు ధీటుగా బదులిచ్చేందుకు సిద్దం కావాలనే నెట్స్‌లో శ్రమించాడు.

 గత పరాభావానికి ప్రతీకారం..

గత పరాభావానికి ప్రతీకారం..

గత ప్రపంచకప్‌లో షాహిన్ బౌలింగ్‌లో డకౌట్ అయిన రోహిత్.. ఈ సారి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. రోహిత్ శర్మ తర్వాత దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌పటేల్‌ ప్రాక్టీస్‌ను వీక్షించాడు. కార్తీక్‌.. ల్యాప్‌ స్కూప్‌, స్కూప్‌, పుల్‌, రివర్స్‌ స్వీప్‌ షాట్లను సాధన చేశాడు. కాసేపటి తర్వాత మళ్లీ నెట్స్‌లోకి వచ్చి శ్రీలంక లెఫ్ట్‌ ఆర్మ్‌ త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ నువాన్‌ సేనావిరత్నే బౌలింగ్‌లో రోహిత్‌ ప్రాక్టీస్‌ చేశాడు. మెరుపు వేగంతో వచ్చిన బంతుల్ని అతడు సమర్థంగా ఎదుర్కొన్నాడు. మొత్తానికి లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ అఫ్రిదికి చుక్కలు చూపించాలనే తాపత్రయంతోనే రోహిత్ ఉన్నట్లు కనిపించింది.

పాక్ బలం రెట్టింపు..

పాక్ బలం రెట్టింపు..

గాయంతో ఆసియాకప్‌కు దూరమైన షాహిన్ అఫ్రిది పూర్తిగా కోలుకొని ప్రపంచకప్‌కు అందుబాటులోకి వచ్చాడు. అతని రాకతో పాక్ జట్టు బలంతో పాటు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన షాహీన్‌ అఫ్రిది ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌తో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అనంతరం అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో వార్మప్‌ మ్యాచ్‌లో మాత్రం తనదైన యార్కర్లతో దుమ్మురేపాడు. ఇద్దరు అఫ్గాన్‌ ఓపెనర్లను ఔట్‌ చేసిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ పేసర్‌ రెండు వికెట్లు తీశాడు. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో షాహీన్ అఫ్రిదే భారత జట్టు ఓటమిని శాసించాడు. మరోసారి అతను కీలకం కానున్నాడు.

భారత్ X పాక్ మ్యాచ్‌పై నీలినీడలు..

భారత్ X పాక్ మ్యాచ్‌పై నీలినీడలు..

యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. లానినా ప్రభావం కారణంగా ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత్ X పాక్ మ్యాచ్‌కు వేదికైన మెల్‌బోర్న్‌లో కూడా వర్షాలు పడుతున్నాయి. మ్యాచ్ జరిగే ఆదివారం కూడా 80 శాతం వర్షం వచ్చే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వర్షం కాస్త బ్రేక్ ఇవ్వడంతో భారత ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. అయితే వాతావరణ మెరుగవుతుందనే సంకేతాలు వినబడుతున్నాయి.

Story first published: Saturday, October 22, 2022, 10:57 [IST]
Other articles published on Oct 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+