Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగులు చేసిన ఓపెనర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డ్‌ను హిట్ మ్యాన్ అధిగమించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20 పరుగులు చేసి వెనుదిరిగిన విషయం తెలిసిందే.

కెరీర్‌ ఆరంభంలో మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్.. ధోనీ సారథ్యంలో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేయడంతో పాటు మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. తాజా మ్యాచ్‌లో అతను ఓపెనర్‌గా 9 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. 181 ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. సచిన్ టెండూల్కర్ 197 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా 9 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 9వేలకు పైగా పరుగులు చేసిన ఆరో ఓపెనర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

India vs Pakistan Live స్కోరు కార్డు

IND vs PAK Rohit Sharma Creates History As Breaks Sachin Tendulkar s Record

అత్యధిక పరుగులు చేసిన వన్డే ఓపెనర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 15310 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. సనత్ జయసూర్య(12740), క్రిస్ గేల్(10179), ఆడమ్ గిల్‌క్రిస్ట్(9200), సౌరవ్ గంగూలీ(9146)‌లు రోహిత్ కంటే ముందు ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ వన్డేల్లో 11 వేల పరుగుల మైలురాయి అందుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. వన్డేల్లో ఈ ఫీట్ సాధించేందుకు 14 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో షాహిద్ అఫ్రిది 351 సిక్స్‌లతో టాప్‌లో ఉండగా.. రోహిత్ 338 సిక్స్‌లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(111 బంతుల్లో 7 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(67 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Sunday, February 23, 2025, 19:44 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+