Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ఏమో సార్ నాకు గుర్తుకులేదు.. పాక్ జర్నలిస్ట్‌ సెటైర్‌కు రోహిత్ శర్మ కౌంటర్!

IND vs PAK: Rohit Sharma Brutally Trolls Pakistan Journalist In Press Conference

దుబాయ్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్‌ నోరు మూయించాడు. ఆసియాకప్‌ 2022లో భాగంగా దాయాదీ దేశాలు ఆదివారం తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. శనివారం జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మ దుమ్మురేపాడు. తనదైన సమాధానాలతో నవ్వులు పూయించాడు. ముఖ్యంగా ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్ వేసిన సెటైర్‌కు దిమ్మతిరిగే బదులిచ్చాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సదరు పాక్ జర్నలిస్ట్ రోహిత్ శర్మను ఎగతాళి చేసే ప్రయత్నం చేశాడు.

ఏమో సార్ నాకు గుర్తుకులేదు..

'రోహిత్.. పాకిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమి.. భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుందా?'అని ప్రశ్నించాడు. దీనికి రోహిత్ శర్మ'చూడండి.. నాకు మెమోరి పవర్ చాలా తక్కువ. ఏడాది క్రితం జరిగిన విషయాలేవి నాకు గుర్తుకుండవ్.'అని దిమ్మతిరిగే బదులిచ్చాడు. తెలుగు సినిమా‌ల్లోని డైలాగ్ 'ఏమో సార్.. నాకు గుర్తుకుండదు'అని ఎటకారంగా బదులివ్వడంతో అక్కడ నవ్వులు పూసాయి.

నాకేం తెలుసు సార్..

నాకేం తెలుసు సార్..

భవిష్యుత్తులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి సిరీస్‌లను చూడొచ్చా? అని మరో పాక్ జర్నలిస్ట్ అడగ్గా.. ఈ నిర్ణయం తీసుకునేంతటి మోతవారిని తాను కాదని బదులిచ్చాడు. 'చూడండి.. ద్వైపాక్షి సిరీస్‌లు నిర్వహించే నిర్ణయం తీసుకునే బోర్డు అధికారిని కాదు. మా క్రికెట్ బోర్డు ఏది చెబితే అది చేసే వ్యక్తిని మాత్రమే. రోహిత్.. పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు సిద్దంగా ఉండని ఆదేశిస్తే.. బ్యాగులు సర్దుకోని బరిలోకి దిగడమే నా పని. అంతేగానీ కీలక నిర్ణయాలు తీసుకోవడం నా చేతుల్లో లేదు'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

తుది జట్టును ఎంపిక చేయలేదు..

తుది జట్టును ఎంపిక చేయలేదు..

ఇక పాకిస్థాన్‌తో బరిలోకి దిగే భారత తుది జట్టును ఇంకా నిర్ణయించలేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ రోజు జరిగే అఫ్గానిస్థాన్, శ్రీలంక మ్యాచ్ చూసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయోననే విషయం తెలుసుకోని తుది జట్టును ఎంపిక చేస్తామని చెప్పాడు. ఇక విరాట్ కోహ్లీ సూపర్ టచ్‌లో ఉన్నాడని చెప్పిన రోహిత్.. అతను చాలా కష్టపడుతున్నాడని పేర్కొన్నాడు. ఎక్కువగా ఆలోచించకుండా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాడని తెలిపాడు. విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు.. కరోనా కారణంగా ప్రతీ ఆటగాడు మానసిక సమస్యలు ఎదుర్కొన్నాడని రోహిత్ అభిప్రాయపడ్డాడు.

అందుకే దినేశ్ కార్తీక్..

అందుకే దినేశ్ కార్తీక్..

సత్తాచాటడంతో దినేశ్ కార్తీక్ మళ్లీ జట్టులోకి వచ్చాడని చెప్పిన హిట్ మ్యాన్.. పునరాగమనం చేసిన ప్రతీసారి అతను అద్భుతంగా రాణించాడని గుర్తు చేశాడు. జట్టులో చోటు కోల్పోయేముందు కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడని పేర్కొన్నాడు. ఇక ఆసియాకప్‌ గెలవాలనే లక్ష్యంతోనే ఇక్కడికి వచ్చామని, శుభారంభం చేస్తామనే నమ్మకం ఉందని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Saturday, August 27, 2022, 19:34 [IST]
Other articles published on Aug 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+