IND vs PAK: సిగ్గుందారా వడపావ్.. బార్డర్‌లో సస్తుంటే పాక్ ఆటగాళ్లతో ముచ్చట్లా? రోహిత్ శర్మపై నెటిజన్లు ఫైర్!

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఓ వర్గం నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌తో హిట్‌మ్యాన్ చిట్ చాట్ చేయడమే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఆసియాకప్ 2022 టోర్నీలో భాగంగా భారత్ X పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం దుబాయ్ చేరిన ఇరు జట్లు విజయమే లక్ష్యంగా సన్నదమవుతున్నాయి. హైఓల్టేజ్ మ్యాచ్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నఇరు జట్ల ఆటగాళ్లు.. ప్రాక్టీస్ అనంతరం సరదాగా మాట్లాడుకుంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ ఇతర భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లను కలిసిన ఫొటోలు, వీడియోలు రెండు రోజులుగా వైరల్ అయ్యాయి.
పెళ్లి ఎప్పుడ్రా బాబర్..
తాజాగా రోహిత్ శర్మ- బాబర్ ఆజామ్‌తో చిట్ చాట్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చాలా సరదాగా సాగిన ఈ చిట్ చాట్ సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటవ్ బాబర్'అని రోహిత్ అడగ్గా.. 'ఇప్పట్లో లేదు భయ్యా'అంటూ బాబర్ నవ్వుతూ బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలు వారి మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజేయగా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరేమో సరిహద్దులు ధాటిన స్నేహం అంటూ కొనియాడుతుంటే మరికొందరు మాత్రం ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు.
సిగ్గుందారా వడపావ్..
ఓ నెటిజన్ అయితే రోహిత్ శర్మ.. బాబర్ ఆజామ్‌ను కలవడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. ఓవైపు బార్డర్‌లో పాకిస్థాన్ దుశ్చర్యల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే మరోవైపు భారత ఆటగాళ్లు సిగ్గు లేకుండా నవ్వులు చిందిస్తూ ఆ దేశ ఆటగాళ్లతో చిట్ చాట్ చేస్తున్నారని మండిపడ్డాడు. మరో నెటిజన్ అయితే సిగ్గుందారా? వడపావ్.. పాక్‌పై గెలవడంపై ఫోకస్ పెట్టకుండా వాడి పెళ్లి గురించి ఆరా తీస్తున్నావ్ అంటూ ఘాటుగా విమర్శించాడు. రిటైర్మెంట్ తర్వాత పెళ్లిల బ్రోకర్ అవుదామనుకుంటున్నావా? అని మండిపడుతున్నారు.
రేప్ కేసు ఉండటంతో..
పెళ్లి చేసుకుంటానని గత 10 ఏళ్లుగా ఓ అమ్మాయిన పాక్ కెప్టెన్ బాబర్ రేప్ చేస్తున్నాడని, అందుకే పెళ్లి చేసుకోనని చెబుతున్నాడని మరో నెటిజన్ సెటైర్ పేల్చాడు. పాకిస్థాన్‌కు చెందిన ఓ అమ్మాయి బాబర్ తనను రేప్ చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇక గతేడాది టీ20 ప్రపంచకప్‌లో దాయాదీ దేశాల మధ్య మ్యాచ్ జరగ్గా.. మళ్లీ ఇన్నాళ్లకు తలపడబోతున్నాయి. గతేడాది ఎదురైన ఘోర పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. అదే జోరు కొనసాగించి మరోసారి షాకివ్వాలనే పట్టుదలతో పాక్ ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications