అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లో గెలిచిన రోహిత్ సేన హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్‌తో శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్‌తో రఫ్ఫాడించిన భారత్.. ఆ తర్వాత సూపర్ బ్యాటింగ్‌తో పాకిస్థాన్ పతనాన్ని శాసించింది.
ఈ విజయంతో ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై తమ ఆధిపత్యాన్ని 8-0గా మార్చింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(58 బంతుల్లో 7 ఫోర్లతో 50), మహమ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 7 ఫోర్లతో 49) మినహా అంతా విఫలమయ్యారు.

భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/19), మహమ్మద్ సిరాజ్(2/50), హార్దిక్ పాండ్యా(2/34), కుల్దీప్ యాదవ్(2/35), రవీంద్ర జడేజా(2/38) రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86) తృటిలో శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. హసన్ అలీ ఓ వికెట్ తీసాడు.
స్వల్ప లక్ష్యచేధనకు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. వరుస బౌండరీలతో జోరు కనబర్చిన శుభ్‌మన్ గిల్(16)ను షాహిన్ షా అఫ్రిది క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(16)తో రోహిత్ ధాటిగా ఆడాడు. అయితే కోహ్లీని షాట్ పిచ్ బాల్‌తో హసన్ అలీ పెవిలియన్ చేర్చాడు. దాంతో టీమిండియా పవర్ ప్లేలో 2 వికెట్లకు 79 పరుగులు చేసింది.
అనంతరం ధాటిగా ఆడిన రోహిత్ శర్మ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి వేగంగా పరుగులు చేశాడు. సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను షాహిన్ షా అఫ్రిది బోల్తా కొట్టించాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ వికెట్ పారేసుకున్నాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(18 నాటౌట్) సాయంతో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్.. బౌండరీతో భారత విజయ లాంఛానాన్ని పూర్తి చేశాడు.