టీమిండియా మహిళా వికెట్ కీపర్ రిచా ఘోష్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో వికెట్ల వెనుకాల రిచా ఘోష్ ఒంటి చేత్తో అసాధారణ క్యాచ్ అందుకుంది. ఆమె స్టన్నింగ్ డైవ్ క్యాచ్‌కు పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా(13) బిత్తరపోయింది. నిరాశగా పెవిలియన్ చేరింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఆశా శోభనా వేసిన 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని ఆశా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా స్లోగా వేయగా.. పాక్ బ్యాటర్ స్లాగ్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేసింది. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమైన ఆమె.. అడ్వాన్స్ షాట్ ఆడటంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి తొలి స్లిప్ ఫీల్డర్ దిశగా దూసుకెళ్లింది.

వికెట్ కీపర్ రిచా ఘోష్ కుడివైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో బంతిని అద్భుతంగా అందుకుంది. రిచా ఘోష్ సింగిల్ హ్యాండ్ డైవ్ క్యాచ్ చూసి ఫాతిమా బిత్తరపోయింది. ఈ క్యాచ్ వీడియోను చూసిన నెటిజన్లు రిచా ఘోష్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులే చేసింది. నిదా దార్(34 బంతుల్లో ఫోర్‌తో 28) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో తెలుగు తేజం అరుందతి రెడ్డి(3/19) మూడు వికెట్లతో సత్తా చాటగా.. రేణుక సింగ్, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు. శ్రేయాంక పాటిల్‌కు రెండు వికెట్లు దక్కాయి.
Fatima Sana scores back to back boundaries and then Richa Ghosh takes a absolute Blinder to dissmiss pakistan captain of Asha Sobhana bowling 🇮🇳
— ANUJ THAKKUR (@anuj2488) October 6, 2024
What A Catch 😱🔥 #INDvsPAK #T20WorldCup #WomenInBlue #RichaGhosh #INDvPAK pic.twitter.com/1DjqrwvhD6