విరాట్ కోహ్లీకి సూర్య, రోహిత్‌లా ఆడటం చేతకాదు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరును ఉద్దేశించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లా ధాటిగా ఆడటం కోహ్లీకి చేతకాదన్నాడు. విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు పనికిరాడని, అతని బ్యాటింగ్ శైలి వన్డే ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతుందన్నాడు. అతని స్లో బ్యాటింగ్ కారణంగానే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ టైటిల్ అందుకోలేకపోయిందన్నాడు. ఆసియాకప్ 2022లో భాగంగా హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడాడు. దాంతో అతని బ్యాటింగ్ తీరును రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషించాడు.

ధాటిగా ఆడటం చేతకాదు..
విరాట్ కోహ్లీ ఎప్పటికీ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలా ధాటిగా ఆడలేడు. విరాట్ కోహ్లీ ఇలా నెమ్మదిగా ఆడటం వల్లే ఆర్‌సీబీ ఇప్పటిదాకా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. ఎందుకంటే అతనికి ఇన్నింగ్స్ స్పీడ్ పెంచడం రాదు. మహేంద్ర సింగ్ ధోనీ కూడా కొన్ని డాట్ బాల్స్ ఆడేవాడు. కానీ ఆ తర్వాత కొన్ని సిక్సర్లు కొట్టి లెక్క సరిచేసేవాడు. విరాట్ కోహ్లీకి మాత్రం ఇది చేతకావడం లేదు. కాబట్టి హంగ్ కాంగ్‌పై అతను ఎలా ఆడాడనేదాని గురించి చర్చ అనవసరం.

వన్డే ఫార్మాట్ బ్యాటర్..
అది విరాట్ కోహ్లీ సహజమైన ఆట. అతను ఎక్కువగా 30-35 పరుగులు ధాటిన తర్వాత భారీ షాట్లు ఆడతాడు. నేను ఐపీఎల్ చూస్తాను, భారత జట్టు ఆడే మ్యాచులు కూడా చూస్తాను. రోహిత్ శర్మ పవర్ ప్లేని బాగా వాడుకుంటాడు. రోహిత్ క్రీజులో ఉంటే ఎక్కువ సేపు సైలెంట్‌గా ఉండడు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూనే ఉంటాడు. విరాట్ కోహ్లీకి ఇది రాదు. ఎందుకంటే అతను టీ20 ప్లేయర్ కాదు. విరాట్ కోహ్లీ యావరేజ్ బాగుంటది కానీ అతని స్ట్రైయిక్ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.

మ్యాచ్ విన్నర్లు కాదు..
విరాట్ కోహ్లీని స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్, బాబర్ ఆజమ్‌లతో పోలుస్తాం. ఎందుకంటే వీరిలో ఎవ్వరూ కూడా టీ20ల్లో మ్యాచ్ విన్నర్లు కాదు. అయితే వన్డేల్లో మాత్రం వీళ్లెవ్వరూ విరాట్ కోహ్లీ దగ్గరికి కూడా రాలేదు. వన్డేలకు కావాల్సిన స్కిల్స్ విరాట్‌లో పుష్కలంగా ఉన్నాయి. వన్డేల్లో మొదటి 10 ఓవర్లు ఓ లెక్క, ఆ తర్వాత 11 నుంచి 40 ఓవర్లు మరో లెక్క... చివరి 10 ఓవర్ల లెక్క వేరు. ఈ మూడు లెవెల్స్‌లో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీకి బాగా తెలుసు.'అని లతీఫ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications