Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: మళ్లీ వర్షం అంతరాయం.. డక్‌వర్త్ లూయిస్ లెక్కలు ఏంటంటే..?

పల్లెకెలె: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగిస్తోంది. భారత ఇన్నింగ్స్ సమయంలో రెండు సార్లు ఆటంకం కలిగించిన వర్షం.. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌కు ముందు మరోసారి అంతరాయం కలిగించింది. దాంతో మైదాన సిబ్బంది గ్రౌండ్‌ను పూర్తిగా కవర్లతో కప్పివేసారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో266 పరుగులకు కుప్పకూలింది. ఇషాన్ కిషన్(81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 82), హార్దిక్ పాండ్యా(90 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 87) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 138 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు.

Pakistans target

చివర్లో బుమ్రా(16) విలువైన పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా.. హ్యారీస్ రౌఫ్, నసీమ్ షా మూడేసి వికెట్లు తీసారు. వర్షం కారణంగా పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం వర్షం తగ్గగా.. మైదాన సిబ్బంది గ్రౌండ్‌ను ఆటకు రెడీ చేసేందుకు శ్రమిస్తున్నారు. 9 గంటలకు అంపైర్లు పిచ్ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

డక్ వర్త్ లూయిస్ ప్రకారం పాకిస్థాన్ టార్గెట్ లెక్కలు ఇలా ఉన్నాయి. మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదిస్తే పాకిస్థాన్ లక్ష్యం 254 పరుగులుగా ఉండనుంది. అదే 40 ఓవర్లకు కుదిస్తే 239, 30 ఓవర్లకు కుదిస్తే 203, 20 ఓవర్లకు కుదిస్తే 155 పరుగులుగా ఉండనుంది. పూర్తి మ్యాచ్ అయితే సాధ్యమయ్యే అవకాశం లేదు.

Story first published: Saturday, September 2, 2023, 21:08 [IST]
Other articles published on Sep 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+