అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్‌తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పాకిస్థాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ తెలిపాడు.
'పిచ్‌పై స్వల్పంగా తేమ ఉంది. మా బౌలింగ్ విభాగంపై ఉన్న నమ్మకంతో ముందు ఫీల్డింగ్ ఎంచుకున్నా. ఇది కొంత మైదానం. ఈ మ్యాచ్ కోసం మేం బాగా సన్నదమయ్యాం. ఇక్కడి రెండు వేదికల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. మా బౌలర్లు, ఫీల్డర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. నా టీమ్ మీద నాకు నమ్మకం ఉంది. మా తొలి ప్రాధాన్యత మెరుగైన ప్రదర్శన చేయడమే. గెలుపు మార్జిన్ల గురించి మేం ఆందోళన చెందడం లేదు. జట్టులో ఒక మార్పు చేశాం. షయాన్ స్థానంలో అలీ హసన్ వచ్చాడు.'అని ఫర్హాన్ యూసఫ్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. టాస్ ఓడినా మేం కోరుకున్నదే దక్కింది. మా కుర్రాళ్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మేం చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఈ రోజు బాగా ఎండ కొడుతుంది. మా తొలి మూడు మ్యాచ్‌ల్లో వర్షం పడింది. గత రెండు మ్యాచ్‌ల్లో వాతావరణం మెరుగ్గా ఉంది. తుది జట్టులో ఒక మార్పు చేశాం. ఉధవ్ మోహన్ స్థానంలో దీపేష్ వచ్చాడు.'అని ఆయుష్ మాత్రే చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్ U19 : హంజా జహూర్ (వికెట్ కీపర్), సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హుజైఫా అహ్సాన్, అలీ హసన్ బలోచ్, అబ్దుల్ సుభాన్, మోమిన్ కమర్, మహమ్మద్ సయ్యమ్, అలీ రజా.
భారత్ U19: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్.