Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ఒక్క నోబాల్.. 59 పరుగుల భారీ మూల్యం! (వీడియో)

కొలంబో: ఎమర్జింగ్ ఆసియాకప్‌‌లో భాగంగా దాయాదీ పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫైనల్లో యంగ్ ఇండియా పేసర్ రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ ఘోర తప్పిదం చేశాడు. టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాను గుర్తు చేశాడు. క్రికెట్‌లో ఘోర నేరంగా భావించే నోబాల్ వేసి ప్రత్యర్థి బ్యాటర్ సైమ్ ఆయుబ్‌కు లైఫ్ ఇచ్చాడు.

ఈ అవకాశాన్ని అందుకున్న అతను హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్‌లతో 59 పరుగులు చేసి జట్టుకు మంచి శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ సహిబ్జాదా ఫర్హాన్‌తో కలిసి తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అదృష్టవశాత్తు సైమ్ ఆయూబ్‌ను మనవ్ సుతార్ ఔట్ చేయడంతో హంగర్గేకర్ ఊపిరి పీల్చుకున్నాడు.

IND vs PAK: Pakistan opener Survives After Rajvardhan Hangargekars No ball In Emerging Asia Cup Final

లేకుంటే మరో బుమ్రాలా చరిత్రలో నిలిచిపోయేవాడు. ఏది ఏమైనా హంగర్గేకర్ నోబాల్ కారణంగా పాకిస్థాన్ శుభారంభం అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ చివరి బంతికి సైమ్ ఆయుబ్‌ క్యాచ్ ఔటయ్యాడు. కానీ అది నోబాల్ అంటూ అంపైర్ బిగ్ షాకిచ్చాడు. దాంతో భారత ఆటగాళ్లు నిరాశకు గురవ్వగా.. పాక్ బ్యాటర్ ఊపిరి పీల్చుకున్నాడు.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జస్‌ప్రీత్ బుమ్రా నోబాల్‌తో గట్టెక్కిన ఫకార్ జమాన్ సెంచరీతో చెలరేగి భారత పతనాన్ని శాసించాడు. అప్పట్లో బుమ్రా తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. హంగార్గేకర్ నోబాల్ ఘటనను చూసిన తర్వాత అందరూ మరోసారి బుమ్రా నోబాల్‌ను గుర్తు చేసుకున్నారు. అయితే స్పిన్నర్లు చెలరేగి టాప్-5 బ్యాటర్లను త్వరగానే పెవిలియన్ చేర్చారు.

కానీ తాయబ్ తాహిర్ అసాధారణ బ్యాటంగ్‌తో చెలరేగుతుండటంతో పాక్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. 40 ఓవర్లలోనే ఆ జట్టు 264 పరుగులు చేసింది. 300 పరుగుల లోపే పాక్‌ను కట్టడి చేస్తే భారత బ్యాటర్లు ఒత్తిడి లేకుండా స్వేచ్చగా ఆడగలరు. లేకుంటే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మాదిరి ఈ మ్యాచ్‌లోనూ ఓటమికి తల వంచాల్సిందే.

భారత్ జట్టు: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నికిన్ జోస్, యష్ ధూల్, రియాన్ పరాగ్, నిషాంత్ సంధు, ధృవ్ జురెల్, మనవ్ సుతార్, యువరాజ్ దోడియా, హర్షిత్ రానా, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్

పాకిస్థాన్ జట్టు: సైమ్ ఆయుబ్, సహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసఫ్, తాయబ్ తాహిర్, ఖాసిం అక్రమ్, మహ్మద్ హ్యారిస్, ముబాసిర్ ఖాన్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ వాసిమ్, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్

Story first published: Sunday, July 23, 2023, 17:14 [IST]
Other articles published on Jul 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+