Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్థాన్.. వరల్డ్ రికార్డ్!

పాకిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఓ ఇన్నింగ్స్‌లో ఆరుగురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించిన తొలి జట్టుగా పాకిస్థాన్ చరిత్రకెక్కింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా భారత్‌తో ఆదివారం జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆరుగురు స్పిన్నర్లను ఉపయోగించింది. 18 ఓవర్లను స్పిన్నర్లు వేయగా.. ఏకైక పేసర్‌గా షాహీన్ అఫ్రిది రెండు ఓవర్లు బౌలింగ్ చేసాడు.

కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో పాటు సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చేశారు. సల్మాన్ అఘా రెండు ఓవర్లు బౌలింగ్ చేయగా.. సయీమ్ అయూబ్, మహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారీఖ్ నాలుగేసి ఓవర్లు బౌలింగ్ చేశారు. షాదాబ్ ఖాన్ ఒక ఓవర్ వేయగా.. అబ్రార్ అహ్మద్ మూడు ఓవర్లు వేసాడు. షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్ ధారళంగా పరుగులిచ్చుకున్నారు. 19 ఏళ్ల టీ20 ప్రపంచకప్ 2026 చరిత్రలో ఏ జట్టు కూడా ఇలా ఆరుగురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించలేదు. ఈ రికార్డ్‌ను మరే జట్టు కూడా అధిగమించే అవకాశం లేదు. భారత్ ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగింది. మరో ఇద్దరు పార్ట్‌టైమ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించింది.

IND vs PAK Pakistan Create History Become First Team in 19 Years to Achieve Unique T20 World Cup Feat

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో 3 ఫోర్లతో 32), శివమ్ దూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27) విలువైన పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/25) మూడు వికెట్లు తీయగా.. ఉస్మాన్ తారిక్(1/24), సల్మాన్ అఘా, షాహిన్ షా అఫ్రిదిలకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 44) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/17), అక్షర్ పటేల్(2/29), వరుణ్ చక్రవర్తీ(2/17), హార్దిక్ పాండ్యా(2/16) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Sunday, February 15, 2026, 22:01 [IST]
Other articles published on Feb 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+