
చెలరేగిన మహమ్మద్ రిజ్వాన్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. బాబర్ ఆజామ్(51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ నవాజ్(20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), అసిఫ్ అలీ(16) కీలక పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.

బాబర్, ఫకార్ ఔటైనా..
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ బాబర్ ఆజామ్(14)ను రవిబిష్ణోయ్ ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లోనే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫకార్ జమాన్‌తో కలిసి రిజ్వాన్ ధాటిగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలో పాక్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. అనంతరం జమాన్‌ను చాహల్ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో మహమ్మద్ నవాజ్‌ను పాక్‌ను అప్‌ది ఆర్డర్‌లోకి ప్రమోట్ చేసింది.

దెబ్బతీసిన నవాజ్..
క్రీజులోకి వచ్చిన నవాజ్‌తో రిజ్వాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఓవర్‌కు ఒక బౌండరీ బాదుతూ.. రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ క్రమంలోనే చాహల్ వేసిన 15వ ఓవర్ రెండో బంతిని రిజ్వాన్ బౌండరీ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక భువనేశ్వర్ కుమార్ వేసిన 16వ ఓవర్‌లో మహమ్మద్ నవాజ్(42) దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. హార్దిక్ వేసిన 17వ ఓవర్‌లో రిజ్వాన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

కొంపముంచిన అర్షదీప్ సింగ్..
బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్‌లో అసిఫ్ అలీ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను అర్షదీప్ నేలపాలు చేశాడు. చివరి 12 బంతుల్లో పాక్ విజయానికి 26 పరుగులు అవసరమవ్వగా.. భువీ 19 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ పాక్ వైపు మళ్లింది. అర్షదీప్ వేసిన చివరి ఓవర్‌లో అసిఫ్ అలీ బౌండరీ బాదినా.. రోహిత్ తనదైన కెప్టెన్సీతో మ్యాచ్‌ను ఉత్కంఠకు తెరలేపాడు.
ఫీల్డింగ్ మొత్తాన్ని సర్కిల్ లోపు తీసుకొచ్చి రెండు డాట్స్ బాల్స్ వేయడంతో పాటు ఓ వికెట్ కూడా సాధించాడు. దాంతో పాక్ విజయానికి చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరమయ్యాయి. కానీ ఐదో బంతిని ఫుల్ టాస్‌గా వేయడంతో క్విక్ డబుల్ తీసిన పాక్.. మరో బంతి మిగిలుండగానే విజయాన్నందుకుంది.


Click it and Unblock the Notifications












