Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: చెలరేగిన భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా.. పాకిస్థాన్ ప్యాకప్! భారత్ ముందు ఈజీ టార్గెట్!

IND vs PAK: Pakistan all out for 147 as Bhuvneshwar Kumar takes 4 wickets

దుబాయ్: ఆసియాకప్‌లో శుభారంభం చేసే దిశగా టీమిండియా దూసుకెళ్తుంది. పాకిస్థాన్ జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. దాంతో పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. భువనేశ్వర్ కుమార్(4/26) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(3/25) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అయితే ఓ దశలో పాక్ 130 పరుగులు కూడా చేస్తుందా? అనిపించింది. కానీ చివరి బ్యాటర్ షాన‌వాజ్ దహని(6 బంతుల్లో 2 సిక్స్‌లతో 16) కీలక పరుగులతో 148 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు. పాక్ జట్టులో బాబర్ ఆజామ్(42 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43) మినహా అంతా విఫలమయ్యారు. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది.

దుమ్మురేపిన భువీ..

దుమ్మురేపిన భువీ..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లోనే బాబర్ ఆజామ్(10) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన బౌన్సర్‌కు బాబర్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక ఫస్ట్ ఓవర్‌లోనే రివ్యూతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బాబర్.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. బాబర్ ఔటవ్వడంతో పాక్ ఆత్మరక్షణలో పడిపోయింది. మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. అయితే ఆవేశ్ ఖాన్ వేసిన 6వ ఓవర్‌లో రిజ్వాన్ ఎదురుదాడికి దిగాడు. వరుస బంతుల్లో 6, 4 కొట్టాడు. అయితే అదే ఓవర్‌లో ఆవేశ్ ఖాన్.. ఫకార్ జమాన్(10)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో పాక్ 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.

దెబ్బతీసిన హార్దిక్..

దెబ్బతీసిన హార్దిక్..

పవర్ ప్లే అనంతరం కూడా పాక్ ధాటిగా ఆడలేకపోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సింగిల్స్‌కే పరిమితమైంది. దాంతో ఆ జట్టు 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లకు 68 పరుగులు చేసింది. డ్రింక్స్ బ్రేక్ అనంతరం చాహర్ బౌలింగ్‌లో ఇఫ్తికర్ భారీ సిక్సర్ బాది జోరు కనబర్చాడు. కానీ హార్దిక్ పాండ్యా వేసిన ఆ మరుసటి ఓవర్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన రిజ్వాన్.. హాఫ్ సెంచరీ దిశగా సాగాడు. కానీ అతని జోరుకు హార్దిక్ కళ్లెం వేసాడు. షార్ట్ పిచ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. అదే ఓవర్‌లో కుష్దిల్(2)ని కూడా పెవిలియన్ చేర్చాడు. దాంతో పాక్ 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

చివర్లో షాన‌వాజ్ మెరుపులు..

చివర్లో షాన‌వాజ్ మెరుపులు..

ఆ తర్వాత భువీ వేసిన 17వ ఓవర్‌లో ఆసిఫ్ అలీ(7) వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మహమ్మద్ నవాజ్‌(1)ను అర్షదీప్ సింగ్ కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. బౌండరీతో దూకుడు కనబర్చిన షాదాబ్ ఖాన్(10)ను భువీ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. షాదాబ్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. అయితే క్రీజులోకి వచ్చిన అరంగేట్ర ప్లేయర్ నసీమ్ షా(0)ను భువీ అదే తరహాలో పెవిలియన్ చేర్చాడు. అయితే చివరి బంతికి షానవాజ్ దహని సిక్సర్ బాది జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. అంతటితో ఆగకుండా అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది భారత్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచాడు. అయితే ఆ మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అవ్వడంతో మరో బంతి మిగిలుండగానే పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Sunday, August 28, 2022, 21:41 [IST]
Other articles published on Aug 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+