IND vs PAK: బాపూ కళ్లు చెదిరే ఫీల్డింగ్.. నోరెళ్లబెట్టిన పాక్ బ్యూటీ!(వీడియో)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. కళ్లు చెదిరే త్రో తో పాకిస్థాన్ ఓపెనర్ ఇమాముల్ హక్(26 బంతుల్లో 10)ను పెవిలియన్ చేర్చాడు. అక్షర్ పటేల్ సంచలన ఫీల్డింగ్‌కు ఇమామ్ ఉల్ హక్ బిత్తరపోయాడు. దాంతో అతను నిరాశగా పెవిలియన్ చేరాడు.
కుల్దీప్ యాదవ్ వేసిన 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని ఇమామ్ మిడాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకున్న అక్షర్ బంతిని నేరుగా వికెట్లకు డైరెక్ట్ హిట్ చేశాడు. దాంతో ఇమాముల్ హక్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ స్టన్నింగ్ రనౌట్ చూసి పాకిస్థాన్ బ్యూటీ నోరెళ్లబెట్టింది. ప్రస్తుతం ఈ మిస్టరీ గర్ల్ రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. సదరు అమ్మాయి బాగుందని, ఇన్‌స్టా ఐడీ ఏంటో చెబితే బ్రేక్ ఇస్తామని కామెంట్ చేస్తున్నారు.
India vs Pakistan Live స్కోరు కార్డు

స్టన్నింగ్ రనౌట్ చేసిన అక్షర్ పటేల్‌పై కూడా నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాపూ వాటే ఫీల్డింగ్ అని కొనియాడుతున్నారు. అక్షర్ పటేల్ చేతిలోకి బంతి వెళ్లిన తర్వాత సింగిల్ తీయడమా? అని కామెంట్ చేస్తున్నారు. ఇమామ్ ఉల్ హక్ ఔట్‌తో పాకిస్థాన్ 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్, మహమ్మద్ రిజ్వాన్ ఆచితూచి ఆడుతున్నారు. అంతకుముందు బాబర్ ఆజామ్(23)ను హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ డెలివరీతో పెవిలియన్ చేర్చాడు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో రిజ్వాన్-సౌద్ షకీల్ స్లోగా బ్యాటింగ్ చేస్తున్నారు.
Bapu, tari fielding kamaal chhe...!!! 🔥 pic.twitter.com/uL1YObjwvJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025
Pakistan fan reaction 😂🤣#INDvsPAK pic.twitter.com/gTfUj58xBr
— Open_talks_Bhargav 🗣️🎙️ (@social_teky) February 23, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications