ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ -పాకిస్థాన్ మధ్య జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్‌ను టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టీవీలో వీక్షిస్తున్నాడు. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌తో కలిసి ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో చూస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను జియో హాట్‌స్టార్ ప్రేక్షకులకు చూపించింది.
India vs Pakistan Live స్కోరు కార్డు
ఈ విజువల్స్‌ను బట్టి ధోనీ.. ఐపీఎల్ యాడ్ షూట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లో జెర్సీ ధరించిన ధోనీ.. షూటింగ్ స్పాట్‌లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో మ్యాచ్‌ను వీక్షిస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

టీమిండియా చివరిసారిగా ధోనీ సారథ్యంలోనే 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఈసారైన ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సెమీఫైనల్ చేరనుంది.
ఐదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియో హాట్‌స్టార్‌కు ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సారి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అనామక ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా.. స్కూల్ పిల్లాడిలా ఆటను ఆస్వాదిస్తున్నానని ధోనీ ఓ కార్యక్రమంలో తెలిపాడు. చిన్నప్పుడు అయితే ఎలా ఇష్టంగా ఆడానో.. ఇప్పుడు అలానే ఆటను ఎంజాయ్ చేస్తున్నానని పేర్కొన్నాడు. రిటైర్మెంట్ ప్రణాళికలు ఏంటని ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు నిరాకరించాడు. మరో రెండు రోజుల్లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ క్యాంప్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.
MS Dhoni & Sunny Deol discussing the Progress of India vs Pakistan match. ⭐ pic.twitter.com/YdGlhbiRrf
— Johns. (@CricCrazyJohns) February 23, 2025
SUNNY DEOL MEETS AND HUGS MS DHONI. 🫂❤️ pic.twitter.com/KFZA8LtlCM
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025
MS DHONI WATCHING INDIA vs PAKISTAN...!!!! 💛 pic.twitter.com/scQANItO7B
— Johns. (@CricCrazyJohns) February 23, 2025