IND vs PAK మ్యాచ్‌కు ముందు కీలక వీడియో ట్వీట్ చేసిన బీసీసీఐ! రచ్చంతా బయటనే..!

దుబాయ్: పేరుకు ఆసియా కప్ అయినా ఈ మెగా టోర్నీలో అందరి దృష్టి భారత్-పాకిస్థాన్ పోరుపైనే ఉంది. ఈ పోరు కోసం అభిమానులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అధికారికంగా టోర్నీ నిన్ననే షురూ అయినా.. మరికొద్ది గంటల్లో జరిగే ఇండో-పాక్ పోరుతోనే అసలు ఆట మొదలవనుంది. ఈ మ్యాచ్‌ను ఇరుదేశాల అభిమానులు రెప్పవాల్చకుండా చూస్తారు. బంతి బంతికీ వాళ్ల హార్ట్ బీట్ పెరిగిపోతుంటుంది. చూసేవాళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. కోట్లాది మంది ఆశలు మోస్తూ మైదానంలో గిరిగీసి కొట్టాడే ఆటగాళ్ల సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. చిరకాల ప్రత్యర్థిపై పై చేయి సాధించేందుకు.. దాయాదిపై దమ్ముచూపి తమ దేశ జెండా ఎగరేసేందుకు ప్రాణం పెట్టి పోరాడుతారు. ఇక భారత్-పాక్‌పై నెలకొన్న హైప్ నేపథ్యంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కీలక వీడియోను ట్వీట్ చేసింది.
పాక్ ప్రత్యర్థి మాత్రమే..
జట్టులోని సీనియర్ ఆటగాళ్లంతా ఈ మ్యాచ్‌పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాము ఈ పోరును సాధారణ మ్యాచ్‌లానే ట్రీట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ రచ్చంతా బయటనేనని, తాము ప్రశాంతంగా తమ పని తాము చేస్తామన్నారు. ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 'ఈ మ్యాచ్ కోసం మా సన్నాహకాల్లో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. మేం ప్రత్యర్థి ఎవరా? అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. ప్రత్యర్థి ఎవరా? అనే విషయం కంటే ఓ జట్టుగా విజయం సాధించడంపై మాత్రమే ఫోకస్ పెట్టాం. పాకిస్థాన్ కూడా మాకు మరో ప్రత్యర్థి మాత్రమే. మేం అద్భుతంగా ఆడి ఆ జట్టును ఓడించాలనుకుంటున్నాం. అయితే ఇది బిగ్ చాలెంజ్ అనే విషయం మాకు తెలుసు'అని చెప్పుకొచ్చాడు.

చిల్ బ్రో..
పాకిస్థాన్‌తో రెండు మూడు మ్యాచ్‌లు ఆడనుండటం తమకు గొప్ప అవకాశమని వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఇది తమ సామర్థ్యానికి సవాల్ లాంటిదని, గత రెండు మూడేళ్లు పాక్ అద్భుత ప్రదర్శన కనబరుస్తుందని చెప్పాడు. వారు అసాధారణమైన క్రికెట్ ఆడుతున్నారని, ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్ అన్నాడు. ఇది భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగుతుందని అభిప్రాయపడ్డాడు. పాక్‌తో పోరును సాధారణ మ్యాచ్‌లానే ట్రీట్ చేయాలని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. ఆటను ఆస్వాదించాలని, బయటి విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.

సాయశక్తులా..
తన చిన్నప్పుడు భారత్, పాక్ మ్యాచ్‌ను యుద్దంలా భఆవించేవారని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అయితే తాము మాత్రం ఓ సాధారణ మ్యాచ్‌లానే భావిస్తున్నామని చెప్పాడు. ముఖ్యంగా తాను మాత్రం తన జోన్ ఉంటూ తన ఆట తాను ఆడుకుంటానని చెప్పాడు. విజయమే లక్ష్యంగా పోరాడుతామని జడేజా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ తీవ్ర ఒత్తిడితో కూడుకున్నదన్న రిషభ్ పంత్.. 100 శాతం విజయం కోసం ప్రయత్నిస్తామని చెప్పాడు.

రచ్చంతా బయటే..
భారత్-పాక్ మ్యాచ్ హైప్ అంతా బయటేనని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఈ హైప్, అభిమానుల భావోద్వేగాలను తాము అర్థం చేసుకోగలమని చెప్పాడు. తాము మాత్రం బయటి విషయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా తమ ఆటపైనే ఫోకస్ పెట్టామని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications