For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: అర్ష్‌దీప్, హార్దిక్ తీన్మార్.. పాక్ బ్యాటింగ్ బేజార్! రోహిత్ సేన ముందు లడ్డూ లాంటి టార్గెట్!

IND vs PAK: India chasing 160 as Arshdeep-Hardik help restrict Pakistan to 159/8

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు దుమ్మురేపారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను వణికించారు. సూపర్ బౌలింగ్‌తో ఆ జట్టును 160 పరుగులు సాధారణ లక్ష్యానికే పరిమితం చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్‌ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు. పాక్‌లో వరల్డ్ క్లాస్ పేసర్లు ఉన్న నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఆచితూచి ఆడాల్సిన అవసరం ఉంది.

చెలరేగిన అర్ష్‌దీప్ సింగ్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని భారత బౌలర్లు అందిపుచ్చుకున్నారు. దాంతో పాక్ బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. యువ పేసర్ అర్షదీప్ సింగ్ తన వరుస ఓవర్లలో బాబర్ ఆజామ్(0), మహమ్మద్ రిజ్వాన్(4)లను ఫెవిలియన్ చేర్చాడు. దాంతో పాకిస్థాన్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 32 పరుగులు మాత్రమే చేసింది. ఈ పరిస్థితుల్లో షాన్ మసూద్‌, ఇఫ్తికర్ అహ్మద్ ఆచితూచి ఆడారు.

నిదానంగా ఆడుతూనే వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ముఖ్యంగా ఇఫ్తికర్ అహ్మద్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మూడు భారీ సిక్స్‌లు బాది పాక్ ఇన్నింగ్స్‌ను సెట్ చేశాడు.

ఇఫ్తికర్ హాఫ్ సెంచరీ..

ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను ఆ వెంటనే ఔటయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాదాబా ఖాన్(5), హైదర్ అలీ(2)లను హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్‌లో షార్ట్ బాల్స్‌తో బోల్తా కొట్టించాడు. అదే జోరులో తన చివరి ఓవర్‌లో మహమ్మద్ నవాజ్‌(9)ను కూడా హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ(2)ని అర్ష్‌దీప్ సింగ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చడంతో పాక్ ఇన్నింగ్స్ 130 పరుగులకే ముగుస్తుందేమోనని అంతా అనుకున్నారు.

షాన్ మసూద్ పోరాటం..

కానీ ఈ పరిస్థితుల్లో షాన్ మసూద్ సూపర్ బ్యాటింగ్‌తో జట్టు స్కోర్‌ను ముందుకుతీసుకెళ్లాడు. నిదానంగా ఆడినా.. విలువైన హాఫ్ సెంచరీతో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది. ఏకంగా మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి అతను తప్పించుకున్నాడు. షాహిన్ షా అఫ్రిది కూడా సిక్స్, బౌండరీ కొట్టి విలువైన పరుగులు జోడించాడు. భువీ అతన్ని పెవిలియన్ చేర్చినా.. ఆఖరి ఓవర్ హరీస్ రౌఫ్ సిక్సర్ బాది జట్టు స్కోర్‌ను 159 పరుగులకు చేర్చాడు.

Story first published: Sunday, October 23, 2022, 15:40 [IST]
Other articles published on Oct 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+