పల్లెకెలె: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ సారథి బాబర్ ఆజామ్ సూపర్ కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. భారత బ్యాటర్ల బలహీనతపై మంచి స్టడీ చేసిన బాబర్ ఆజామ్.. వారికి తగ్గట్లు బౌలింగ్ చేయించి ఫలితాన్ని రాబట్టాడు.
స్వింగ్ బౌలింగ్‌కు ఇబ్బంది పడే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు షాహిన్ షా అఫ్రిదితో చెక్ పెట్టిన బాబర్ ఆజామ్.. బౌండరీలతో క్రీజులో సెట్ అయ్యే ప్రయత్నం చేసిన శ్రేయస్ అయ్యర్‌ను సూపర్ ప్లాన్‌తో పెవిలియన్ చేర్చాడు. హ్యారీస్ రౌఫ్‌ను రంగంలోకి దింపిన బాబర్ ఆజామ్.. శ్రేయస్ అయ్యర్ షాట్ పిచ్ బాల్ బలహీనతపై దెబ్బ కొట్టాడు.

హ్యారీస్ రౌఫ్ పరుగులిస్తున్నా అతనితో బౌలింగ్ కొనసాగించిన బాబర్ ఆజామ్.. ఊరించే షాట్‌బాల్‌తో అతనికి చెక్ పెట్టాడు. పాకిస్థాన్ ప్లాన్‌ను పసిగట్టలేకపోయిన శ్రేయస్ అయ్యర్(14) గుడ్డిగా షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. ఫార్వార్డ్ ఫీల్డర్‌ను పెట్టారనే సోయి లేకుండా షాట్ పిచ్ బాల్‌కు టెంప్ట్ అయ్యి భారీ షాట్ ఆడాడు. కానీ బంతి నేరుగా ఫార్వార్డ్ ప్లేయర్ చేతిలో పడింది.
గత కొద్ది కాలంగా శ్రేయస్ అయ్యర్‌ను షాట్ పిచ్ బాల్ బలహీనత వెంటాడుతోంది. ప్రత్యర్థి టీమ్ ఏదైనా.. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు రాగానే షాట్ పిచ్ బాల్‌తో అతన్ని బుట్టలో వేసుకుంటుంది. ఈ బలహీనతను అధిగమించానని చెప్పిన అయ్యర్.. మళ్లీ అదే బాల్‌కు ఔటవ్వడం భారత అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.
శ్రేయస్ అయ్యర్ వికెట్‌తో టీమిండియా 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లో పడింది. క్రీజులోకి ఇషాన్ కిషన్ రాగా.. మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దాంతో అంపైర్లు ఆటను నిలిపేయగా.. మైదాన సిబ్బంది గ్రౌండ్‌ను కవర్లతో కప్పేసారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 11.2 ఓవర్లలో 3 వికెట్లకు 51 పరుగులు చేసింది.
ఓ భారీ భాగస్వామ్యం నమోదు అయితేనే టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించగలదు. లేకుంటే చిత్తుగా ఓడిపోవాల్సిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం కూడా టీమిండియా కొంపముంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవర్‌కాస్ట్ కండిషన్స్ పాకిస్థాన్ పేసర్లకు కలిసొస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు.