Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: మంత్రమేసి వికెట్ తీసిన హార్దిక్ పాండ్యా! (వీడియో)

అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు దుమ్మురేపుతున్నారు. బౌలింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై వ్యూహాత్మక బౌలింగ్ చేస్తూ వికెట్లు రాబడుతున్నారు. భారత బౌలర్ల ధాటికి పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(20), ఇమామ్ ఉల్ హక్(36) వెనుదిరిగారు.

అబ్దుల్లాను క్రాస్ సీమ్ డెలివరీతో సిరాజ్ పెవిలియన్ చేర్చితే.. ఇమామ్ ఉల్ హక్‌ను హార్దిక్ పాండ్యా ఆఫ్ స్టంప్ డెలివరీతో కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు.అయితే ఈ వికెట్ ముందుకు పేలవ బౌలింగ్‌తో బౌండరీలు సమర్పించుకున్న హార్దిక్ పాండ్యా.. వికెట్ తీసే ముందు బంతికి ఏదో మంత్ర వేసాడు. చాలా కోపంగా మంత్రం చదివిన హార్దిక్.. అదే జోరులో బౌలింగ్ చేసి వికెట్ రాబట్టాడు.

IND vs PAK: Hardik Pandya mantra to the ball before taking the wicket of Imam-ul-Haq

వికెట్ తీసిన అనందంలో హార్దిక్ పాండ్యా పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌కు టాటా చెప్పాడు. బంతికి హార్దిక్ పాండ్యా మంత్రం వేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 'హార్దిక్ మంత్రం.. ఇమామ్ ఖతమ్'అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

హిందువు అయిన హార్దిక్ పాండ్యా.. క్రిస్టియన్ అయిన నటాషాను పెళ్లి చేసుకొని ముస్లింలా నమాజ్ చేసి వికెట్ సాధించాడని, భారత సంస్కృతి ప్రతిబించాడని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇమామ్ ఔటైన అనంతరం మహమ్మద్ రిజ్వాన్ క్రీజులోకి రాగా.. రవీంద్ర జడేజా ఔట్ చేసినంత పని చేశాడు. స్వీప్ షాట్ ఆడే క్రమంలో రిజ్వాన్ విఫలమవ్వగా.. టీమిండియా ఎల్బీ కోసం అప్పీల్ చేసింది. అంపైర్ కూడా ఔటివ్వగా.. రిజ్వాన్ రివ్యూ తీసుకున్నాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను మిస్సవ్వడంతో మహమ్మద్ రిజ్వాన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

బాబర్ ఆజామ్‌తో కలిసి రిజ్వాన్ ఆచితూచి ఆడుతున్నాడు. 16 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ 2 వికెట్లకు 88 పరుగులు చేసింది.

Story first published: Saturday, October 14, 2023, 15:41 [IST]
Other articles published on Oct 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+