కొలంబో: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన బౌలింగ్‌తో సత్తా చాటాడు. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హార్దిక్ కీలక వికెట్ తీసాడు. స్టన్నింగ్ డెలివరీతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్‌కు బాబర్ ఆజామ్ బిత్తరపోయాడు.
ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని స్వింగ్ చేయగా.. పంచ్ షాట్ ఆడబోయి కట్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతకుముందు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(9)ను బుమ్రా స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పాకిస్థాన్ 43 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

బాబర్ ఆజామ్ ఔటైన వెంటనే వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 111 నాటౌట్), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 122 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ(49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 10 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఈ మ్యాచ్‌లో భారత టాప్-4 బ్యాటర్లు రాణించడం విశేషం. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో పాకిస్థాన్ లక్ష్యాన్ని కుదించే అవకాశం ఉంది. 26 ఓవర్ల ఆట సాధ్యమైతే 244 పరుగులు.. 24 ఓవర్లకు కుదిస్తే 230 రన్స్, 22 ఓవర్లు అయితే 216 పరుగులు, 20 ఓవర్లు అయితే 200 పరుగులు పాకిస్థాన్ చేయాల్సి ఉంది.
పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు పూర్తవ్వగా.. మరో 9 ఓవర్ల ఆట జరిగితే డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఫలితం తేల్చుతారు. లేకుంటే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. ప్రస్తుతం వర్షం ఆగిపోగా.. మైదాన సిబ్బంది గ్రౌండ్‌ను రెడీ చేసేందుకు శ్రమిస్తున్నారు.