Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: కోహ్లీ సెంచరీ.. గంభీర్ రియాక్షన్ వైరల్ (వీడియో)

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. గెలుపుతో టీమిండియా గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ ముందు వరకు విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ అసలు సిసలు పోరులో తన క్లాస్ గేమ్‌తో సత్తా చాటి విమర్శకుల నోళ్లు మూయించాడు.

పరిస్థితులకు తగ్గట్లు ప్రశాంతంగా క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో నాటకీయ పరిణామాల మధ్య సెంచరీ మార్క్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ శతకానికి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లంతా ఫిదా అయ్యారు. రోహిత్ శర్మ అయితే తెగ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్ ఆసాంతం సీరియస్‌గా కనిపించిన గౌతమ్ గంభీర్.. కోహ్లీ సెంచరీతో చిరునవ్వులు చిందించాడు. అనంతరం మైదానంలోకి వెళ్లి కోహ్లీని హత్తుకొని ప్రత్యేకంగా అభినందించాడు.

IND vs PAK Gautam Gambhir reaction goes viral after Virat Kohli match winning century

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గతంలో ఈ ఇద్దరు పలు సందర్భాల్లో గొడవ పడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ సందర్భంగా రెండు సార్లు ఈ ఇద్దరూ కొట్టుకోవడానికే సిద్దమయ్యారు. ఢిల్లీకే చెందిన ఈ ఇద్దరూ మైదానంలో తమ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే గంభీర్ అవకాశం దొరికినప్పుడల్లా కోహ్లీని విమర్శించేవాడు.

ముఖ్యంగా అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. గంభీర్ విమర్శల దాడి మరి ఎక్కువగా ఉండేది. అతన్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలనే తరుచూ డిమాండ్ చేసేవాడు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోహ్లీతో సయోధ్య కుదుర్చుకున్న గంభీర్.. ఎలాంటి గొడవల్లేకుండా ఓ ఆటగాడిగానే ట్రీట్ చేస్తున్నాడు. కానీ సోషల్ మీడియా వేదికగా కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం గంభీర్‌ను విశ్వసించడం లేదు. ఈ క్రమంలోనే కోహ్లీ సెంచరీ నేపథ్యంలో గంభీర్ రియాక్షన్‌కు ప్రాధాన్యత నెలకొంది.

Story first published: Monday, February 24, 2025, 11:51 [IST]
Other articles published on Feb 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+