Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: దడుసుకున్న పోరడు.. బుగులు జ్వరం అంటూ ఆవేశ్‌ ఖాన్‌పై పేలుతున్న మీమ్స్!

IND vs PAK: Funny Memes regarding Avesh khan fever

హైదరాబాద్: ఆసియా కప్‌‌ 2022 పుణ్యమా అని భారత్, పాకిస్థాన్ జట్లు వారం రోజుల్లోనే రెండోసారి పోటీకి సిద్దమయ్యాయి. మెగా ఈవెంట్‌‌ గ్రూప్‌‌‑ఎలో పాక్‌‌పై ఉత్కంఠ విజయంతో బోణీ కొట్టిన టీమిండియా నేడు సూపర్‌‌‑4 రౌండ్‌‌ తొలి పోరులో ఆ జట్టును మళ్లీ ఢీకొట్టనుంది. గత ఫలితాన్ని పునరావృతం చేయాలని రోహిత్‌‌సేన భావిస్తుంటే.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్‌‌ కసిగా ఉన్నది. ఈ నేపథ్యంలో మరో 'సూపర్‌‌ సండే' క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌కు మంచి కిక్‌‌ ఇవ్వనుంది. అయితే ఫస్ట్ మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసి జోరు మీదున్న టీమిండియాకు గాయాల బెడద వేధిస్తోంది.

మార్పులు అనివార్యం..

రవీంద్ర జడేజా మొకాలి గాయంతో జట్టుకు దూరమవడంతో జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. పాక్ స్పిన్నర్లను ఎదుర్కొవాలంటే టీమిండియా తప్పనిసరిగా లెఫ్టార్మ్ బ్యాటర్లను ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్షర్ పటేల్, రిషభ్ పంత్‌లను జట్టులోకి తీసుకోడం అనివార్యమైంది. మరోవైపు హాంగ్ కాంగ్‌తో దారుణంగా విఫలమైన ఆవేశ్ ఖాన్ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడని కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ప్రస్తుతం అతను జ్వరంతో బాధపడుతున్నాడని పేర్కొన్నాడు.

దడుసుకున్న పోరడు..

ఇక ఆవేశ్ ఖాన్‌కు జ్వరం రావడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో పాటు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. భారత్ X పాకిస్థాన్ మ్యాచ్ అనగానే ఆవేశ్ ఖాన్ దడుసుకున్నాడని, అతనికి బుగులు జ్వరం పట్టుకుందని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం జ్వరం ఏం లేదని పక్కనపెట్టేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ చెబుతున్నా సాకని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆవేశ్ ఖాన్ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది.

అట్టర్ ఫ్లాఫ్..

ఆసియా కప్ గ్రూప్ దశలో రెండు మ్యాచ్‌లు ఆడిన ఈ మధ్యప్రదేశ్ పేస్ బౌలర్... ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లల్లో 19 పరుగులు ఇచ్చాడు. ఫకర్ జమాన్ వికెట్ తీసాడు. రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌పై పూర్తిగా చేతులెత్తేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక్కడా అతను పడగొట్టింది ఒక్క వికెట్ మాత్రమే. ఓవర్‌కు 13 చొప్పున పరుగులను సమర్పించుకున్నాడు. దాంతో ఆవేశ్ ఖాన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

Story first published: Sunday, September 4, 2022, 18:10 [IST]
Other articles published on Sep 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+