అహ్మదాబాద్: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ దుమ్మురేపుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్‌లో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే రెండు కీలక వికెట్లు తీసిన ఈ హైదరాబాద్ పేసర్.. పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బతీసాడు. బౌలింగ్‌కు ఏ మాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి వికెట్లు రాబడుతున్నాడు.
క్రాస్ సీమ్ డెలివరీతో పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(20)ను ఔట్ చేసిన సిరాజ్.. హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్(50) స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 30వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ నాలుగో బంతిని సిరాజ్ గుడ్ లెంగ్త్‌లో వేయగా.. బాబర్ ఆజామ్ సరిగ్గా అంచనా వేయలేక మూల్యం చెల్లించుకున్నాడు. బౌన్స్ వస్తుందని భావించిన అతను బంతిని ఆడలేకపోయాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి ఆఫ్‌స్టంప్ బెయిల్స్‌ను తాకేసింది. ఈ బాల్‌ను చూసి బాబర్ ఆజామ్ బిత్తరపోయాడు. అలా ఎలా మిస్సైందంటూ నోరెళ్లబెట్టాడు. సిరాజ్ దెబ్బతో మూడో వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతం క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్(6), ఇఫ్తికర్ అహ్మద్(4) కుల్దీప్ యాదవ్ ఓకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. దాంతో పాకిస్థాన్ 166 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
సౌద్ షకీల్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చిన కుల్దీప్ యాదవ్.. ఇఫ్తికర్ అహ్మద్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి షాదాబ్ ఖాన్ రాగా.. రిజ్వాన్ పోరాడుతున్నాడు. సంచలన బౌలింగ్‌తో పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసిన మహమ్మద్ సిరాజ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాబర్ ఆజామ్‌పై సిరాజ్ రివేంజ్ తీర్చుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.