పల్లెకెలె: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. 66 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును.. ఇషాన్ కిషన్ సూపర్ బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు.
వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి మెచ్యూర్‌గా బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్.. తనదైన షాట్లతో పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో 54 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

వన్డే క్రికెట్‌లో ఇషాన్ కిషన్‌కు ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం. వెస్టిండీస్ పర్యటనలో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్.. పాకిస్థాన్‌తోనూ అదే జోరు కొనసాగించాడు.
షాహిన్ షా అఫ్రిది, హ్యారీస్ రౌఫ్ నిప్పులు చెరగడంతో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లీ(4), శ్రేయస్ అయ్యర్(14), శుభ్‌మన్ గిల్(10) దారుణంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్ల ధాటికి భారత్ 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ ఇషాన్ కిషన్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు.
అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా(43 బ్యాటింగ్) కూడా రాణిస్తుండటంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరి భాగస్వామ్యం 101 పరుగులకు చేరింది. ఇషాన్ కిషన్ సూపర్ బ్యాటింగ్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'సూపర్‌రా బుడ్డోడా'అని కొనియాడుతున్నారు. సెంచరీ చేసి పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని కోరుతున్నారు.
ఈ ఇన్నింగ్స్‌తో ఇషాన్ కిషన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన రెండో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. అంతర్జాతీయ వన్డేల్లో 17 ఇన్నింగ్స్‌ల్లోనే 1500 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఇందులో 17 హాఫ్ సెంచరీలతో పాటు ఒక డబుల్ సెంచరీ ఉంది. 32 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 4 వికెట్లకు 160 పరుగులు చేసింది.