Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KL Rahul: గురూజీ.. యూ ఆర్ గ్రేట్!

కొలంబో: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ అజేయ శతకంతో చెలరేగాడు. గాయంతో ఐదు నెలల పాటు ఆటకు దూరమైన రాహుల్.. రీఎంట్రీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు.

విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 233 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మొత్తం 106 బంతులు ఆడిన రాహుల్.. 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన రాహుల్.. క్రీజులో సెట్ అయిన తర్వాత తనదైన శైలిలో చెలరేగాడు.

 Fans hail KL Rahul

పాకిస్థాన్ బౌలర్లపై అటాకింగ్ గేమ్‌తో విరుచుకుపడ్డాడు. నసీమ్ షా వేసిన 46వ ఓవర్‌లో క్విక్ డబుల్‌తో రాహుల్ 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ శతకంతో విమర్శకుల నోరు మూయించాడు. వాస్తవానికి ఈ మ్యాచ్‌‌కు చివరి నిమిషంలో రాహుల్ జట్టులోకి వచ్చాడు. మ్యాచ్ ప్రారంభానికి 5 నిమిషాల ముందు శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పికి గురవ్వడంతో రాహుల్‌ను తీసుకున్నారు.

ఈ అవకాశాన్ని రాహుల్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. వాస్తవానికి ఆసియాకప్ లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రాహుల్‌ను జట్టులోకి ఎలా తీసుకుంటారని మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశ్నించారు. రాహుల్‌కు అంత ప్రత్యేకత ఎందుకు ఇస్తున్నారని నిలదీసారు. అతని వల్ల జట్టుకు తీరని నష్టం జరుగుతుందని హెచ్చరించారు.

కానీ రాహుల్ అసాధారణ బ్యాటింగ్‌తో అందరి నోళ్లు మూయించాడు. తాను ఎంతటి విలువైన ఆటగాడిననే విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ క్రమంలోనే రాహుల్‌కు అభిమానులు క్షమాపణలు చెబుతున్నారు. 'గురూజీ యూ ఆర్ గ్రేట్'అనే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'రాహుల్ జీ.. నిన్ను తక్కువ అంచనా వేసి తప్పు చేశాం.. మమ్మల్ని క్షమించండి'అని కామెంట్ చేస్తున్నారు.

 Fans hail KL Rahul

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 122 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ(49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 10 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇమామ్ ఉల్ హక్(9), బాబర్ ఆజామ్(10), మహమ్మద్ రిజ్వాన్(2) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులోకి వచ్చిన అఘా సల్మాన్(10 బ్యాటింగ్)‌తో ఫకార్ జామన్(20 బ్యాటింగ్) పోరాడుతున్నాడు.

Story first published: Monday, September 11, 2023, 22:00 [IST]
Other articles published on Sep 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+